Wednesday, May 6, 2026 09:30 PM
Wednesday, May 6, 2026 09:30 PM

దేశాన్ని షేక్ చేస్తున్న మెన్‌ టూ నినాదం…!

మొన్నటి వరకూ మీటూ ఉద్యమం సోషల్ మీడియాను షేక్ చేస్తే.. ఇప్పుడు మెన్‌ టూ అంటూ మగజాతి నినదిస్తోంది. ఓ భర్త ఆత్మహత్య దేశవ్యాప్తంగా సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై స్వయంగా సుప్రీంకోర్టే ఆవేదన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా #MeToo ఉద్యమం వేడిని రాజేసింది. లైంగిక దాడుల బాధితులం అంటూ వివిధ వృత్తుల్లోని మహిళలు తమ చుట్టూ ఉన్న వారిపై చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. అయితే నాణేనికి రెండో వైపు ఉన్నట్టుగా.. రీసెంట్‌గా భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెర తీసింది.

Also Read: పరారీలో గౌతంరెడ్డి… ఎక్కడున్నాడో తెలుసా…?

మహిళలు మాత్రమే బాధితులు అన్నట్లుగా ఉన్న చట్టాలను ప్రశ్నిస్తోంది. #MenToo నినాదానికి ఊపిరిపోసింది. భార్య వేధింపులు తాళలేక అతుల్ సుభాష్ చేసుకున్న ఆత్మహత్య ఇప్పుడు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే అతుల్ సుభాష్‌కు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె అతుల్ సుభాష్‌పై కేసులు పెట్టింది. అసహజమైన శృంగారం, కట్నం కోసం వేధింపులు అంటూ అనేక రకాల కేసులు పెట్టింది. తన తప్పు లేకున్నా తనను వేధించాలన్న కారణంతోనే భార్య కేసులు పెట్టిందని పోలీసులకు చెప్పినా వాళ్లు వినలేదు. అతుల్ సుభాష్‌నే నిందితుడు అని తేల్చేశారు.

Also Read: మొదటిసారి అమెరికాకు కేసీఆర్‌.. ఎందుకో తెలుసా..?

దీంతో ఆవేదనకు లోనైన అతుల్ సుభాష్ అన్ని వివరాలు సమగ్రంగా లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. 24 పేజీల ఆ లేఖలో అతుల్ పడిన మానసిక వేదన సుస్పష్టంగా కనిపించింది. అతుల్ లేఖ చట్టాల్లోని లొసుగులను ఎత్తి చూపుతోంది. దీంతో.. మేం కూడా మనుషులమే అంటూ మగజాతి సాగిస్తోన్న మెన్‌ టూ ఉద్యమం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చట్టాలు దుర్వినియోగం చేసి మగవాళ్లను వేధిస్తున్న కొందరు భార్యల గురించి ఎన్నోసార్లు కథనాలు వచ్చినా.. నిజాలు బయటపడినా.. తప్పుడు కేసులని తెలిసినా మగవాళ్లనే బాధితులుగా చేస్తున్నారంటూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Also Read : అండర్ గ్రౌండ్ కు పేర్ని…? భార్య కోసం త్యాగం

చట్టాల విషయంలో తమకు ఉన్న స్వేచ్చను దుర్వినియోగం చేస్తూ మగవాళ్లను వేధిస్తున్న వారికి ఎలాంటి శిక్షల్లేవా అన్న ప్రశ్నలు ఊపందుకున్నాయి. భార్యలు పెడుతున్న బాధల కారణంగా మగవాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు.. కొందరు ఆడవాళ్ల బ్లాక్‌మెయిలింగ్‌కు రక్షణ కవచంగా.. ఏ తప్పూ చేయని కొందరు మగాళ్ల పాలిట శాపంలా మారిన సెక్షన్ 498A ( #Section498A ) పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అత్తవారింట్లో భర్త, భర్త కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Also Read: వైసీపీలో వేరే లీడర్లే లేరా..? జగన్ పై క్యాడర్ ఫైర్..!

భర్తపై, భర్త కుటుంబంపై వ్యక్తిగత కక్ష సాధించడం కోసం 498A సెక్షన్ కింద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెక్షన్ 498A నిబంధనల ద్వారా భర్తనే కాకుండా మొత్తం అత్తింటివారి కుటుంబాన్ని కూడా టార్చర్ చేసేందుకు కొందరు దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కొందరు భర్తలు, వారి కుటుంబం మానసిక క్షోభ, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనల్లో కొన్ని విషాదాంతాలుగా ముగియడం కలకలం రేపుతోంది.

Also Read: టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?

బాధితుల రక్షణ కోసం రూపొందించిన 498A చట్టాన్ని.. దుర్వినియోగం చేయకుండా చూసుకోవడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తప్పనిసరి చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరకట్న వేధింపులకు సంబంధించిన వాస్తవ ఘటనలు ఉన్నప్పటికీ.. ఆర్థికంగా సమస్యలు పరిష్కరించాలని భర్త, అతడి కుటుంబాలను వేధింపులకు గురి చేయాలనే ఉద్దేశంతో భారీగా కేసులు నమోదు అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు నిరాధారమైన కేసులు ఉన్నాయని.. చట్టాన్ని తప్పుగా ఉపయోగించడాన్ని అరికట్టేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు.

Also Read : మళ్లీ నేనే వస్తా… దువ్వాడ మాస్ వార్నింగ్…!

అయితే ఏదైనా పెద్ద ఘటనలు జరిగినపుడు మాత్రమే ఇలాంటి వాటిపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత అంతా ఎక్కడికక్కడ సద్దుమణిగిపోతోంది. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఇప్పుడు మళ్లీ అతుల్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖతో పలువురు ప్రముఖ లాయర్లు సైతం.. వరకట్న చట్టం, దానిలో తీసుకురావాల్సిన మార్పులపై మరోసారి బలమైన వాదన వినిపిస్తున్నారు. మరి దీనిపై సుప్రీం స్పందన ఎలాంటి మార్పులు తేబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్