ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులు సీరియస్ గా ఉండటంతో ఇప్పుడు వైసీపీ నేతలు భయం భయంగా గడుపుతున్నారు. గత ఐదేళ్లపాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచేసిన వైసిపి నేతలు ఇప్పుడు సాక్షాలతో సహా దొరికిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. గతంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలపై చెలరేగిపోయి నానా మాటలు అంటూ వైఎస్ జగన్ వద్ద పాలేరుగా పనిచేసిన పేరుని నాని పౌరసరఫరాల శాఖలో చేసిన అవినీతి బయటకు రావడంతో ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
Also Read : వన్ నేషన్ వన్ ఎలక్షన్ షురూ… ఒక్క అడుగు అంతే
తన భార్య జయసుధ పేరుతో నాని రేషన్ బియ్యం అక్రమ దందాకు పాల్పడ్డారని అధికారులు గుర్తించడంతో ఇప్పుడు ఒక కేసు కూడా నమోదు అయింది. దీనితో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పేర్ని నాని ఉన్నారు. దీనితో పేర్ని నానీ కుటుంబం మొత్తం ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. శుక్రవారం రైతులకు మద్దతుగా పోరాటం చేయాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి నాని హాజరవుతారా లేదా అనేదానిపై స్పష్టత రావడం లేదు. బందర్ నియోజకవర్గంలో కాబోయే నాయకుడిగా చలామణి అవుతూ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన పేర్ని కిట్టు కూడా ఎక్కడున్నాడో సమాచారం లేదు.
Also Read : అమ్మో పవన్ అంటున్న అధికారులు.. తర్వాతి గురి ఎవరిపై..?
దీనితో బందరు వైసీపీ నాయకులు ఎప్పుడు నిరసన కార్యక్రమాలు చేయాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక జిల్లా కోర్ట్ లో కూడా ముందస్తు బయలు పిటిషన్లు దాఖలు చేసింది పేరు నాని కుటుంబం. నానీని కచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తన గౌడాన్ లో బియ్యం మాయం కావడంపై నానీ చెప్పిన సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టి 90 లక్షల విలువ చేసే బియ్యం మాయం చేసినట్టు గుర్తించారు.