Saturday, September 19, 2026 02:26 PM
Saturday, September 19, 2026 02:26 PM

అలా ఎలా అవకాశం ఇస్తారు సర్..!

అలా ఎలా అవకాశం ఇస్తారు సార్ అనే మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం… తెలుగుదేశం పార్టీని ఇన్నాళ్లు దుమ్మెత్తి పోసిన నేతలకు అధినేత అవకాశం ఎలా ఇస్తారనేది సగటు కార్యకర్త మాట. గతంలో పార్టీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు సైలెంట్ గా సైకిల్ ఎక్కుతామని చెబితే.. సరే అని ఎలా అంటారు సార్ అనేది పార్టీ కార్యకర్త మొదలు ద్వితీయ శ్రేణి నాయకుల వరకు వినిపిస్తున్న మాట. అదే సమయంలో గతంలో ఇలాగే కొంతమంది చేసిన ఘనకార్యాలను కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.

Also Read: పవన్ పై వైసీపీ సానుభూతి వల.. సాయిరెడ్డి గేమ్ స్టార్ట్..!

వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి వైసీపీ నేతలు టీడీపీ అధికారంలోకి రాగానే… జగన్ కు హ్యాండ్ ఇచ్చారు. వీరంతా ఇప్పుడు టీడీపీలో చేరేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 2009కి ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరిన వాసిరెడ్డి పద్మ… నాటి నుంచి టార్గెట్ టీడీపీ అన్నట్లుగా విమర్శలు చేశారు. ప్రజారాజ్యం నుంచి వైసీపీలో చేరిన తర్వాత విమర్శల ఘాటు పెంచారే తప్ప తగ్గించలేదు. షర్మిల పాదయాత్ర ఆసాంతం ఆమె వెన్నంటి నడిచారు. అందుకే జగన్ ఆమెకు మహిళా కమిషన్ చైర్మన్ వంటి కీలక పదవి ఇచ్చారు.

Also Read: అదాని నిన్ను ఎంతకు కొన్నాడు చంద్రబాబు..?

పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు టీడీపీ నేతలను ముప్పుతిప్పలు పెట్టారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేశారు. పోతుల సునీత కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవి అనుభవించారు. ఆ తర్వాత వైసీపీకి జై కొట్టారు. ఈవిడ కేవలం రాజకీయ విమర్శలు, చంద్రబాబు ని విమర్శించటం వరకే పరిమితం కాకుండా నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి ని కూడా తాగుబోతులు అంటూ చేసిన విమర్శలు మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఆవిడ మళ్లీ ఇప్పుడు టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇలాంటి వారికి పార్టీలో అవకాశం ఇవ్వొద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్