ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ను జాతీయ స్థాయిలో వాడుకోవడానికి బిజెపి అధిష్టానం సిద్ధమైందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. మరాఠా ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే… అఖండ విజయం సాధించారు 5 నియోజకవర్గాల్లో. అసలు ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో కూడా మంచి విజయం సాధించారు. దీనితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలు చేయించాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన పవన్ అక్కడ బిజీగా గడుపుతున్నారు.
Also Read : పరారీలోనే కీలక కేసుల్లో నిందితులు.. కారణం..?
పలు కీలక అంశాలపై బిజేపి అగ్ర నాయకత్వంతో కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక బుధవారం సాయంత్రం… పవన్ ఎన్డియే ఎంపీలకు విందు కూడా ఇస్తున్నారు. ఈ విందు ద్వారా పవన్… అందరిని పరిచయం చేసుకోనున్నారు. త్వరలోనే పవన్… పశ్చిమ బెంగాల్ లో పర్యటనకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ కూడా చేసారు. ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి ‘చిన్మోయ్ కృష్ణ దాస్’ని నిర్భందించిన బంగ్లాదేశ్ పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హిందువులపై బంగ్లాదేశ్ లో అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు.
Also Read : పంతం నెగ్గించుకున్న రఘురామ..!
కృష్ణ దాస్ ను నిర్బంధించడాన్ని ఖండిస్తూ అందరం కలిసికట్టుగా పోరాడుదాం అని పవన్ పిలుపునిచ్చారు. హిందువులపై దాడులు ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పోస్ట్ లో రాసుకొచ్చారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం మా వనరులు ఖర్చయ్యాయి, ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. మన హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న తీరు మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోందని ఐఖ్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ఈ ఘటనలపై బెంగాల్ సర్కార్ స్పందించలేదు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడం… అలాగే ఢిల్లీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ బిజేపి ఎంపీలతో భేటీ కావడం చూస్తుంటే ఆయన బెంగాల్ పర్యటనకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

