ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఓ మంత్రి పదవి విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. దాదాపు పది మంది పేర్లు వినపడినా ఎవరి పేరు ఖరారు చేస్తారో స్పష్టత లేదు. దసరా, దీపావళి అయిపోయాయి.. త్వరలోనే సంక్రాంతి కూడా ఉంది. ఆ టైం కి అయినా మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవి విషయంలో క్లారిటీ వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. రఘురామ కృష్ణం రాజు పేరు వినపడినా ఆయన డిప్యూటి స్పీకర్ గా సభలో కుదురుకుపోయారు. ఆ తర్వాత వంగవీటి రాధ పేరు కూడా గట్టిగానే వినపడింది. అలాగే సుజనా చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా చర్చకు వచ్చాయి.
Also Read : ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో అవినీతి పుట్ట
అయితే ఇప్పుడు బీటెక్ రవి పేరు వినపడుతోంది. బిటెక్ రవి గతంలో ఎమ్మెల్సీగా చేసిన విషయం తెలిసిందే. ఏపీలో నాలుగు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఒక స్థానం నుంచి బిటెక్ రవిని మండలికి పంపి చంద్రబాబు మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. 2020 తర్వాత జగన్… పదే పదే కుప్పంపై టార్గెట్ చేసి… అక్కడి వైసీపీ యువనేత భరత్ కు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబును ఓడిస్తే ఖచ్చితంగా మంత్రిని చేస్తా అని బహిరంగ సభలో కూడా జగన్ ప్రకటన చేసారు అప్పట్లో. అయితే భారత్ గెలవడం సంగతి పక్కన పెడితే.. జగన్ నేతృత్వంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయింది.
Also Read : వారి కోసం వైసీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్…!
ఇప్పుడు అదే ట్రీట్మెంట్ జగన్ కు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అయ్యారు. పులివెందుల నుంచి బిటెక్ రవిని మంత్రిని చేసి… నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే నియోజకవర్గంలో పార్టీ బలపడే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి రవి కూడా సుముఖంగానే ఉన్నారు. కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే రవిని మరోసారి శాసన మండలికి పంపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే పులివెందులలో జగన్ కి వ్యతిరేకంగా సమర్ధుడైన యువకుడిని రంగంలోకి దింపినట్లు అవుతుంది. అధికారం ఉంటేనే అక్కడ ఆధిపత్యం చెలాయించడం సాధ్యం అవుతుంది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు జగన్ కి పక్కలో బల్లెంలా బిటెక్ రవిని దించడానికి సిద్ధం అయ్యారని తెలుస్తుంది.

