Saturday, September 19, 2026 02:10 PM
Saturday, September 19, 2026 02:10 PM

ఫోర్జరీ చేశారు… మరింతగా ఇరుక్కున్నారు..!

కుటుంబ ఆస్తుల వివాదంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రోజు రోజుకు నిండా ముంచుతున్నారు సలహాదారులు. సొంత కుటుంబంలోని పరిస్థితుల్ని ఆయన డీల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో సలహాదారులు జగన్ ను గందరగోళ పెట్టి పిచ్చి పనులు చేయిస్తున్నారు. ఆ పనులతో కుటుంబంలో మరింత అగాధం పెంచుతున్నారు. జగన్ రెడ్డి పరువును బజారున పడేస్తున్నారు.

తాజాగా వైఎస్ విజయలక్ష్మి రాసినట్లుగా ఓ లేఖను సృష్టించారు. అందులో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విజయలక్ష్మి కారుకు కర్నూలులో ప్రమాదం జరిగింది. అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. కోటి రూపాయల విలువైన ఓ లగ్జరీ కారు టైర్లు రెండు ఒకేసారి పేలడం అనేది అసాధ్యం. కంపెనీ కూడా అదే గ్యారంటీ ఇస్తుంది. మరి ఏదో చేయకపోతే ఎలా పేలాయి? అన్నది అందరికీ వచ్చే అనుమానం. ఈ విషయన్నే ఇప్పుడు టీడీపీ ప్రశ్నిస్తోంది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మాదిరిగానే తల్లి విజయలక్ష్మిని కూడా హత్య చేసి… ఆ నెపం టీడీపీపై వేసేసి… ఆ సానుభూతితో ఓట్లు సాధించాలని జగన్ కుట్ర చేసినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read : తెలంగాణాలో రేవంత్ బీ టీం…?

దీనికి వైసీపీ కానీ, జగన్ కానీ అంత కంగారు ఆడాల్సిన పని లేదు… కానీ పడుతున్నారు. ఎందుకంటే ఆ కారు జగన్ మోహన్ రెడ్డి స్వయంగా తన తల్లి కోసం పంపించారు. అందులో సగం డబ్బులు షర్మిలతో కట్టించుకున్నారు. మిగిలిన సగం తన వాటాగా పార్టీలోని ఓ పారిశ్రామికవేత్తతో కట్టించారన్న గుసగుసలు ఉన్నాయి. ఆ కారు జగన్ పంపారు కాబట్టే కౌంటర్ ఇచ్చుకోలేని స్థితిలో వైసీపీ ఉంది. తల్లి పేరుతో ఖండిస్తే.. టీడీపీకి సరైన సమాధానం అనుకున్నారు. కానీ ఈ విషయంలో ఇన్వాల్వ్ కావడానికి ఆమె రెడీ కాలేదు. అందుకే అడ్వాంటేజ్ తీసుకుని సంతకాన్ని ఫోర్జరీ చేసేశారు.

Also Read : బాబు గారు… సూపర్ సిక్స్‌ పథకాలు ఎప్పుడిస్తారు..?

ఆ సంతకాన్ని రేపు మరో విధంగా ఫోర్జరీ చేయరన్న గ్యారంటీ లేకపోవడంతో తీవ్రమైన హెచ్చరికలే వచ్చినట్లుగా ఉన్నాయి. వెంటనే డిలీట్ చేశారు. దీంతో ఉన్న పరువు.. అమ్మ దగ్గర ఏమైనా సానుభూతి ఉంటే అదీ కూడా పోయింది. ఈ సలహా జగన్‌దా.. సజ్జలదా అని ఇప్పుడు వైసీపీ నేతలు మరోసారి చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్