Wednesday, February 4, 2026 06:04 PM
Wednesday, February 4, 2026 06:04 PM

మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో బిగెస్ట్ స్టార్‌గా బన్నీ ఎదగడం వెనుక మెగాస్టార్ ఉన్నా… ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని… తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగా ఫ్యాన్స్ లోని ఒక వర్గం కంప్లయింట్ చేస్తూ ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ కూడా చేస్తున్నారు.

పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అతనికి ఇండియా వైడ్ ఒక యునీక్ ఐడెంటిటీ వచ్చింది. బన్నీలోని ఈ యునీక్ క్వాలిటీ మెగా అభిమానులకు నచ్చినా మెగాస్టార్ చిరంజీవిని విస్మరించడం ఒక సెక్షన్ ఫ్యాన్స్‌కు రుచించటంలేదు. అల్లు అర్జున్ తన దివంగత తాతయ్య అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో మై ఫౌండేషన్ అనే ట్యాగ్ లైన్‌తో అప్ లోడ్ చేయడం మెగా అభిమానుల ఆగ్రహానికి ఒక కారణంగా నిలిచింది. దీన్ని తిరుగుబాటు ధోరణిగా భావిస్తూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు కూడా.

ఈ ఎపిసోడ్ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. అల్లు అర్జున్ విజయాలకు చిరంజీవి మూల స్తంభం అని మెగా ఫ్యాన్స్.. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఎక్కడా అని బన్నీ ఫ్యాన్స్ మాటల తూటాలు పేల్చుకున్నారు. ఇక ఎన్నికల సమయంలో బన్నీ చేసిన పనితో మెగా ఫ్యాన్స్‌ మరింత రగిలిపోయారు. తమ హీరోను బూతులు తిట్టిన వైసీపీ తరఫున ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అని ట్రోల్ చేశారు. దీనికి బన్నీ కూడా ధీటుగానే బదులిచ్చారు. తన స్నేహితుల కోసం ఎంత వరకైనా వస్తా అని తేల్చేశారు.

Also Read : వాళ్ళు తిట్టమంటేనే బూతులు తిట్టా.. ఒప్పుకున్నా బోరుగడ్డ

ఇక అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రమోషన్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసాయి కూడా. చివరికి ఎవర్రా బన్నీ… అని జనసేన నేతలు కూడా అనే స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ షో సమయంలో కూడా ఇదే తరహా వివాదం చెలరేగింది. బాలకృష్ణను హోస్ట్ చేయడంపై అప్పట్లో మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వైరం శృతి మించడంతో స్వయంగా అల్లు అరవింద్ రంగప్రవేశం చేశారు. నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి వైరం లేదని… బాలకృష్ణ, మెగాస్టార్ గతంలో చాలా కార్యక్రమాల్లో కలిసి తిరిగారు కూడా మెగా ఫ్యాన్స్ కూల్ చేసేందుకు అల్లు అరవింద్ ప్రయత్నించారు.

అయితే తాజాగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఆర్మీ విషయంలో మాత్రం అల్లు అరవింద్ ఏ మాత్రం చొరవ చూపడం లేదని తెలుస్తోంది. తాజాగా బన్నీ సినిమా పుష్ప -2 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే మెగా ఫ్యాన్స్ తో పాటు పవన్ వీరాభిమానులు పుష్ప -2 ను చూసేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. అయినా సరే… మెగా ఫ్యామిలీ నుంచి కానీ… అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. మేమంతా ఒకటే అనే మాట రెండు కుటుంబాల నుంచి రాకపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలున్నాయనే విషయం తెలుస్తోంది. ఇటీవల పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తం విజయవాడ వెళ్లింది… అయితే అల్లు తరఫున కనీసం ఒక్కరు కూడా హాజరవ్వలేదు.

సొంతంగా ఎదగాలనుకుంటున్న బన్నీకి మెగా చెట్టు నీడ అవసరం లేదేమో అనే మాట ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోంది. మొత్తానికి, చిరు బ్రాండ్‌తో కాకుండా అల్లు అర్జున్ సొంతగా ఎదగాలనుకుంటున్నారు. ఇందులో తప్పేమి లేదు. ఎంత కాలమని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాలి చెప్పండి. చిరంజీవి సైతం అల్లు అర్జున్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. మరి, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని అనవసర రాద్ధాంతానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారేమో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

పోల్స్