Saturday, September 19, 2026 03:03 PM
Saturday, September 19, 2026 03:03 PM

సాక్షి త‌ప్పుడు రాత‌ల మూల్యం రూ.75 కోట్లు?

చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్ష‌లండి పేరుతో సాక్షిలో అచ్చేసిన అస‌త్య క‌థ‌నంపై నారా లోకేష్ త‌న న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లుగ‌జేసేందుకు క‌థ‌నాలు అవాస్త‌వాల‌తో వేశార‌ని, రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం కేసుని నారా లోకేష్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది దొద్దాల కోటేశ్వ‌ర‌రావు విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో దాఖ‌లు చేశారు. కేసు విచార‌ణ వివిధ ద‌శ‌లు దాటుకుని ఆగ‌స్టు 29న లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్ జ‌రిగింది. మ‌రోసారి క్రాస్ ఎగ్జామినేష‌న్ 18వ తేదీ శుక్ర‌వారం జ‌ర‌గ‌నుండ‌డంతో మంత్రి నారా లోకేష్ కోర్టుకి హాజ‌రు కానున్నారు.

Also Read : టీపీసీసీ చీఫ్‌కు తొలి సమస్య… ఎలా డీల్‌ చేస్తారో మరి?

చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి హెడ్డింగ్‌తో 2019 అక్టోబర్ 22న సాక్షి ప‌త్రిక‌లో క‌ల్పిత క‌థ‌నం ప్ర‌చురించారు. దీనిపై నారా లోకేష్ త‌న న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపించారు. సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో సాక్షిపై రూ.75 కోట్ల‌కు పరువునష్టం దావా వేశారు. సాక్షిలో ప్రచురించిన తేదీల్లో అసలు తాను విశాఖలోనే లేనని, ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌ను అభాసుపాలు చేసేందుకు వండివార్చిన క‌థ‌నం అని తేలింద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా విశాఖపట్నం చాలా సార్లు వ‌చ్చినా, ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని, త‌ప్పుడు క‌థ‌నం రాసి త‌న ప‌రువుకి భంగం కలిగించిన సాక్షిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లోకేష్ కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్