Wednesday, May 6, 2026 11:37 PM
Wednesday, May 6, 2026 11:37 PM

లోకేష్ బయటకు రావాల్సిందేనా…?

2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో ప్రభుత్వంపై ఉన్న అంచనాలు వేరు. రాజకీయంగా ఉన్న గడ్డు పరిస్థితి నుంచి టీడీపీ బయటకు రావడంలో తెలుగు తమ్ముళ్ళ పోరాటం ఎంతగానో ఉంది. ఇది రాజకీయంగా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు, నారా లోకేష్ కు ఖచ్చితంగా నూతన ఉత్సాహం నింపింది. జగన్ కు ఎదురెళ్ళి పోరాటం చేయడంలో తెలుగుదేశం క్యాడర్ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. అయితే అధికారంలోకి వచ్చినన తర్వాత మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊహించిన దానికంటే వాతావరణం చాలా భిన్నంగా ఉంది. కార్యకర్తలను, నాయకులను వేధించిన అధికారులు, నాయకులపై కేసులు లేకపోగా వారిని జనసేనలోకి పంపుతున్నారనే అభిప్రాయం ఉంది. అలాగే ఎమ్మెల్యేల జోక్యం, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వంటివి కూడా టీడీపీ క్యాడర్ కు అసలు ఏ మాత్రం నచ్చడం లేదు. ఈ తరుణంలో చంద్రబాబు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కూడా కార్యకర్తలకు అసలు నచ్చడం లేదు అనే మాట వినపడుతోంది. కేసులు పెట్టించుకున్న కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

Also Read : బాబు వ్యవహారశైలితో లోకేష్ కి డ్యామేజ్ జరుగుతుందా?

ఈ నేపధ్యంలో పార్టీ అభిమానులు, పలువురు రాజకీయ పరిశీలకులు… మంత్రి నారా లోకేష్ ఇప్పుడు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పలువురు. పార్టీకి కార్యకర్తలకు గ్యాప్ పెరుగుతోంది కాబట్టి ఈ విషయంలో కాస్త లోకేష్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తు నాయకుడు లోకేష్ కాబట్టి… క్యాడర్ ను అసలు ఏ విధంగా దూరం చేసుకోవద్దని, పార్టీ కార్యకర్తల్లో ఉన్న సందేహాలకు లోకేష్ సమావేశాలు నిర్వహించి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో ఉన్న సందేహాలను కూడా లోకేష్ తొలగించాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్