Saturday, September 19, 2026 11:14 AM
Saturday, September 19, 2026 11:14 AM

టిడిపి ఆఫీస్ పై దాడి చేసిన వైసీపీ నాయకులు ఊచలు లెక్కపెట్టడం ఖాయమా?

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దారుణాలలో ఒకటి… టీడీపీ ఆఫీసుపై దాడికి దిగడం. వైసీపీకి చెందిన పలువురు నేతలు పార్టీ ఆఫీసుపై దాడికి పూర్తి స్థాయిలో సిద్దమై అనుచరులను పంపడం అప్పట్లో సంచలనం అయింది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు నేతలు తమ అనుచరులను, రౌడీ మూకలను విజయవాడకు పంపించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి అప్పట్లో. వైసీపీ నేతలను అప్పుడు వైఎస్ జగన్ కూడా సమర్ధించారు. ఆ తర్వాత సదరు నేతలు కూడా జగన్ ను తిట్టినందుకే చేసాం అంటూ చెప్పుకున్నారు.

దీనిపై పోలీసులు మాత్రం స్పందించే ప్రయత్నం చేయలేదు. దాడులు చేయడం నేరం అయినా సరే పోలీసులు చూసి చూడనట్టు వదిలేసారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై కూడా అప్పటి మంత్రి జోగి రమేష్ దాడికి దిగారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాడికి వెళ్లి నేను నిరసన చేయడానికి వెళ్ళా అని ఆయన చెప్పుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఆ కేసులను బయటకు తీసారు. దీనితో తమకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ నేతలు కోర్ట్ కి వెళ్ళారు.

Read Also : విజయసాయి కి ఊహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని కోరారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురికి బెయిల్ ను కోర్ట్ తిరస్కరించింది. చంద్రబాబు నివాసం పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ నిరాకరించింది. దీనితో వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2 వారాల వరకు వారిపై చర్యలు వద్దని పోలీసులను ఆదేశించాలంటూ వైసీపీ కోరగా దానిపై కోర్ట్ ఇంకా విచారణ జరపలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్