Saturday, June 20, 2026 08:47 AM
Saturday, June 20, 2026 08:47 AM

ప్రజలు ఛీ కొట్టాక విలువలు గుర్తొచ్చాయా జగన్ రెడ్డీ?

ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమిని ప్రజలు కట్టబెట్టినా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావడం లేదు. నైతిక విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మీరే ముఖ్యమంత్రిననే భ్రమల్లో ఉంటే ఎలా పులివెందుల ఎమ్మెల్యే గారూ? అంటూ మంత్రి అచ్చన్నాయుడు మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఇకనైనా భ్రమలు వీడి వాస్తవంలోకి వస్తే.. ప్రజా ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీనే పెట్టకూడదనడానికి మీరెవరు? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? అంటూ సూటిగా ప్రశ్నించారు.

గతంలో రాజభవన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు, 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. నేను తలుచుకుంటే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేసినప్పుడు విలువలు గుర్తుకురాలేదా? విలువల గురించి మాట్లాడే ముందు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూఠీ చేసిన విధానం, అక్రమాస్తుల కేసులో సీబీఐ వేసిన 11 చార్జ్ షీట్ల గురించి ప్రజలకు చెప్పే దమ్ముందా? అంటూ ఎద్దేవా చేశారు. మీ శవ రాజకీయాలకు, వికృత రాజకీయ క్రీడలకు, విష సంస్క్రతికి కాలం చెల్లింది. మేం తలుచుకుంటే వైసీపీ ఖాళీ అయిపోతుంది అని మంత్రి జగన్ ని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

పోల్స్