Wednesday, May 6, 2026 09:53 PM
Wednesday, May 6, 2026 09:53 PM

చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది.. మందకృష్ణ భావోద్వేగం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు మాదిగలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. ఉప వర్గీకరణ చేయవద్దు అంటూ గతంలో ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్ట్ పక్కన పెట్టింది. 6;1 మెజారిటీ తో సుప్రీం తీర్పు వెల్లడించింది. సుప్రీం తీర్పును అనుసరించి రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని తీర్పులో సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

దీనిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేసారు. ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అనుకూల తీర్పు ఇచ్చిన జడ్జిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియను ముందుకు నడిపించిన వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో వర్గీకరణ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదీ చంద్రబాబే అని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నదీ చంద్రబాబే అని, గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని మందకృష్ణ పేర్కొన్నారు.

నేడు ఎస్సీ వర్గీకరణకు పుణ్యం చంద్రబాబు నాయుడు గారిదే అని ఆయన కొనియాడారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చట్టం స్వీకారం చుట్టారు… నేడు తీర్పు వచ్చే సమయం లో ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే మాకు వర్గీకరణ జరిగడం అనేది గర్వ కారణం అన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకపోతే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి కావని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న చంద్రబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు మంద కృష్ణ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్