టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముల్డర్, 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 2025 జులైలో జింబాబ్వేపై అజేయంగా 367 పరుగులు చేసిన ముల్డర్, తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో సెంచరీ (178 బంతుల్లో 100), బంతితో ఏడు వికెట్లు (11 ఓవర్లలో 31 పరుగులిచ్చి 7 వికెట్లు) తీసి ఈ అసాధారణ ఘనతను అందుకున్నాడు.
Also Read : మేక్ ఇన్ ఇండియాపై ట్రంప్ సర్కార్ గురి..?
ఈ అద్భుత ప్రదర్శనతో ఒకే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఏడు వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఐదో ఆటగాడిగా, దక్షిణాఫ్రికా తరఫున తొలి క్రికెటర్‌గా వియాన్ ముల్డర్ నిలిచాడు. 1980లో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్ కూడా ముల్డరే కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 494/7 వద్ద డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా, మూడో రోజు ముల్డర్ ధాటికి బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 184 పరుగులకే కుప్పకూల్చింది.
Also Read : సొంత జిల్లాలో జగన్ కి బిగ్ షాక్.. బీజేపీలో చేరిన వీరశివారెడ్డి
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు మహ్ఫిజుల్ ఇస్లాం, తంజిద్ హసన్ శుభారంభం ఇచ్చినప్పటికీ, ముల్డర్ తన పదునైన బౌలింగ్‌తో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. తంజిద్ (29), మోమినుల్ హక్ (0)లను అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టిన ముల్డర్, ఆ తర్వాత లిట్టన్ దాస్, జాకర్ అలీ (2), షోరిఫుల్ ఇస్లాం (0), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (34), తస్కిన్ అహ్మద్‌లను పెవిలియన్‌కు పంపి తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు ఏడు వికెట్ల ఘనతను పూర్తి చేశాడు. చివరి వికెట్‌ను మార్కో జాన్సన్ తీయగా, ముల్డర్ క్యాచ్ పట్టడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.


