Monday, November 16, 2026 08:18 PM
Monday, November 16, 2026 08:18 PM

అందరూ మర్చిపోయినా.. ఆ బాలిక ప్రాణం కోసం లోకేష్ తపన..!

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక అప్‌డేట్ అందించారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు వేగంగా స్పందిస్తోందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇటీవల రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో హేమంత్ అనే యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

Also Read : ‘రంగమ్మత్త’కు అవకాశాలు లేవా..?

ఈ దాడిలో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు దాదాపు 8 గంటల పాటు శ్రమించి ప్రాథమికంగా ఆరోగ్యాన్ని నిలకడలోకి తెచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం ఏకధాటిగా దాదాపు 12 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది.

ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ నిపుణుల పర్యవేక్షణలో చికిత్స విజయవంతంగా సాగింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత బయట దీనిపై చర్చ తగ్గినప్పటికీ, ప్రభుత్వం తరఫున బాలిక వైద్య ఖర్చులు, ఆరోగ్య పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు, ప్రతి రెండు రోజులకు ఒకసారి మణిపాల్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా వైద్యులు అందించిన వివరాల ప్రకారం, బాలికకు కృత్రిమ ఆక్సిజన్ అవసరం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

Also Read : గిరిబాబు చివరి కోరిక నెరవేరింది.. రావినూతలలో కన్నీటి వీడ్కోలు

అంతేకాకుండా, ద్రవ, ఘన ఆహారాన్ని కూడా తీసుకుంటోందని, వైద్య సిబ్బంది సహకారంతో నెమ్మదిగా అడుగులు వేస్తోందని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించి బాలిక ప్రాణాలు కాపాడిన మణిపాల్ ఆస్పత్రి వైద్య బృందానికి మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను కళ్లారా చూసి మానసిక ఆందోళనకు గురైన తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం 20 మంది కౌన్సెలర్లను నియమించి, ఏడాది పాటు కౌన్సెలింగ్ అందించే ఏర్పాట్లు చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు,...

ఏపీ లిక్కర్ స్కామ్...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న...

మేయర్ కుర్చీ.. సీనియర్లకు...

ఒక్క మేయర్ కుర్చీ.. మూడు పార్టీల...

పోల్స్