Saturday, November 14, 2026 12:43 PM
Saturday, November 14, 2026 12:43 PM

సర్పంచ్.. ఒకటో సారి.. రెండోసారి.. మూడోసారి..!

అయ్య బాబోయ్.. అమ్మ భాబోయ్.. పంచాయతీ సర్పంచ్ పదవులకు రేటు కోట్లల్లో పలకటం ఏమిటో..?. పంచాయతీ పదవులకు లక్షలు, కోట్లు రేటు ప్రకటిస్తున్న వారు కొందరు.. పదవులకు వేలం పాట పెడతామంటున్నారు మరికొందరు.. సర్పంచ్ పదవులు కొనుక్కునేందుకు కొందరు బయట పడుతుండగా.. వేలం పాటలో చూసుకుందామనుకుని గ్రామ పెద్దలు అంటున్నారు. పంచాయతీ సర్పంచ్ అంటే.. కొందరికి అంత మోజు ఎందుకు..? అది పదవుల పిచ్చా..? లేక ఆర్థికంగా సంపాదించుకోవచ్చు అనే ధీమానా..?

Also Read : గిరిజనుల అభిమానం పవన్ కు ఓట్లుగా ఎందుకు మారలేదు?

ముఖ్యంగా కొందరు చదువుకుంటున్న మహిళలు కూడా పంచాయితీ సర్పంచ్ పదవుల కోసం ఆశ పడటం చూస్తుంటే.. అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికల హడావిడి ప్రారంభం అయ్యింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు లక్షలు, కోట్లు చెల్లించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సర్పంచ్ పదవుల కోసం కోటి నుంచి కోటిన్నర రూపాయలు చెల్లించేందుకు కూడా రెడీ అయ్యారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమను ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నుకుంటే.. కోటి రూపాయలు అయినా ఖర్చు చేస్తామని చాలా గ్రామాల్లో బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

రాజమహేంద్రవరం సమీపంలోని ఓ గ్రామంలో ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది కూడా. తన తండ్రికి సర్పంచ్‌గా అవకాశం ఇస్తే.. గ్రామాభివృద్ధికి కోటిన్నర రూపాయలు ఇస్తానంటూ విద్యార్థిని ఇచ్చిన ఆఫర్.. హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని గ్రామాల్లో అయితే సర్పంచ్ కుర్చీ రేటు రోజు రోజుకూ పెరుగుతోంది కూడా. అయితే చాలా గ్రామాల్లో మాత్రం ముందు నామినేషన్లు వేయండి.. విత్ డ్రా సమయంలో చూసుకుందాం.. అని గ్రామ పెద్దలు చెబుతున్నట్లు తెలుస్తోంది. పదవి కోసం ఖర్చు చేసిన సొమ్మును సింహభాగం గ్రామంలో ఆలయాల అభివృద్ధికి, గ్రామంలో సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలనేది పెద్దల సూచన.

Also Read : నా ఫోన్ లో మోదీ చరిత్ర.. బాంబు పేల్చిన రాహుల్..!

అయితే అధికారులు మాత్రం వేలం పాటల పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ పదవులను డబ్బుతో కొనుక్కోవాలని చూస్తే.. కేసులు పెడతామంటున్నారు అధికారులు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. దీంతో ఈ వ్యవహారం బయటకు రాకుండా.. గ్రామ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామస్తుల మధ్యనే గుట్టుగా వేలం ప్రక్రియ ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక సర్పంచ్ పదవి కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేయడం ఏమిటనేది ఇప్పుడు అందరి మదిలో వినిపిస్తున్న ప్రశ్న.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కూటమికి ఇబ్బందిగా మారిన...

అధికారం అండతో ప్రజాప్రతినిధులు నిబంధనలను తుంగలో...

డేంజర్ జోన్‌లో ఏపీ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకృతి వైపరీత్యాలు వరుసగా...

పంచాయతీ “రాజీ” కియాలు..!

రంగులు మారుతున్న పంచాయతీ "రాజీ" కియాలు.....

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

నా ఫోన్ లో...

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత...

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

పోల్స్