Friday, November 13, 2026 07:01 PM
Friday, November 13, 2026 07:01 PM

నా ఫోన్ లో మోదీ చరిత్ర.. బాంబు పేల్చిన రాహుల్..!

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆస్క్ మీ ఇంటరాక్టివ్ సెషన్‌లో, కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఆయన ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారని ఆరోపించిన రాహుల్ గాంధీ, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన ఫోన్‌లోనే ఉన్నాయని తన ఫోన్‌ను చూపిస్తూ పేర్కొన్నారు.

Also Read : ‘ఇట్లు అర్జున’ రివ్యూ : కొత్త పోరడు హిట్ కొట్టాడా?

తన ఫోన్‌లో ఏముందో ప్రధాని మోదీకి కూడా స్పష్టంగా తెలుసని, ఎందుకంటే ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. గత 12 రోజుల్లో ఏడోసారి ప్రధాని మోదీని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన రాహుల్ గాంధీ, తనతో ముఖాముఖి చర్చకు వస్తే ప్రధాని రాజకీయ జీవితం ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. తనను నిత్యం దేశ వ్యతిరేకిగా అభివర్ణిస్తున్న మోదీ, ఎవరు విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నారో, ఎవరు అసలైన దేశద్రోహులో తేల్చుకోవడానికి ఏ వేదికపైనైనా, ఏ సమయంలోనైనా చర్చకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

Also Read : స్వింగ్ పిచ్‌లంటే టీమిండియాకు ఎందుకంత భయం..?

పార్లమెంటులో తన మైక్ ఆఫ్ చేస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించిన రాహుల్, బయట జరిగే చర్చకు ప్రధాని కావాలంటే టెలిప్రాంప్టర్‌ను కూడా తెచ్చుకోవచ్చని, ఆయనకు నచ్చిన వారినే జడ్జీగా పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు. తన వద్ద ఉన్న ఆధారాల భయంతోనే ప్రధాని తనపై విమర్శలు తగ్గించారని, చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారని అన్నారు. మరోవైపు, రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్, బహిరంగ చర్చ సవాళ్లను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

అసలు మైక్రోసాఫ్ట్ కు...

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో...

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

గిరిజనుల అభిమానం పవన్...

గిరిజనులను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ చేసిన...

‘ఇట్లు అర్జున’ రివ్యూ...

‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’...

కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి...

పెట్టుబడుల వేటలో మంత్రి...

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య...

పోల్స్