విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మధ్య జరిగిన ప్రత్యేక లైవ్ పాడ్‌కాస్ట్ సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా విశాఖపట్నానికి తెలుగు చిత్ర పరిశ్రమను తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందని రానా మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు.
Also Read : లోకల్ వార్‌లో మంత్రుల సొంత లెక్కలు.. వైసీపీ రివర్స్ వ్యూహం..!
అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, అక్కడి నుంచి విశాఖ నగరానికి సాగిన ప్రయాణ అనుభవాన్ని రానా ప్రశంసించారు. రానా ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, విశాఖపట్నానికి చిత్ర పరిశ్రమను తీసుకురావడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. కేవలం సినిమా షూటింగ్‌లకు రాయితీలు ఇవ్వడం మాత్రమే కాకుండా, ఒకప్పుడు హైదరాబాద్‌లో స్టూడియోలు, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫిల్మ్ నగర్ తరహాలో ఎలాగైతే పూర్తిస్థాయి ఎకోసిస్టం నిర్మించారో..
Also Read : కూటమిలో పంచాయతీ కుంపట్లు..!
అదే తరహా ఎకోసిస్టంను విశాఖలోనూ నిర్మించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ వివరించారు. నేటి తరం క్రియేటర్ ఎకానమీ అంటే సినిమాలు, యూట్యూబ్ కంటెంట్, డిజిటల్ మీడియా, గేమింగ్ వంటి రంగాలకు విశాఖ అద్భుతమైన వేదిక కానుందని పేర్కొన్న లోకేష్, ఇందుకోసం సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనపై రానా దగ్గుబాటి అత్యంత సానుకూలంగా స్పందించారు. విశాఖపట్నంలో వినోద రంగం, క్రియేటర్ ఎకోసిస్టం అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని రానా ప్రకటించారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, వాటాదారులను సమన్వయం చేస్తూ విశాఖను ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.


