ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు రోజుల్లో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి కానుంది. అయితే.. ఇక్కడే ఓ విషయంపై చర్చ జోరుగా జరుగుతోంది. అదే ఈ ఎన్నికల్లో అసలైన కింగ్ ఎవరు..? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో అసలైన హీరో ఎవరనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు, సీట్లే కాకుండా.. అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల్లో ఎవరికి ఎంత బలముందనే విషయం కూడా ఈ జెడ్పీ ఎన్నికల్లో తేలిపోయిందంటున్నారు.
Also Read : ఎవరి బీ టీమ్ కాదు.. హామీ ఇస్తున్నా..!
జడ్పీటీసీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి కూటమి పార్టీలు చరిత్ర సృష్టించాయి. అయితే ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో “విజయం చరిత్ర” సృష్టించింది మాత్రం.. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ సభ్యులే భారీ మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు సాధించిన మెజారిటీ.. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకరికేమో 30,273 ఓట్ల మెజారిటీ రాగా, మరొకరికి 28,863 ఓట్ల మెజారిటీ వచ్చింది.
అటు టీడీపీ అభ్యర్థులు.. ఇటు వైసీపీ అభ్యర్థులు కూడా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కసారి కూడా సాధించలేని మెజారిటీ చరిత్రను జనసేన పార్టీ అభ్యర్థులు సాధించారు. ఇందుకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ నాయకత్వం పై ఓటర్లకు వున్న అభిమానం, నమ్మకమే అంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో అభిమానం, క్లీన్ ఇమేజ్ తో పాటు, నిజాయతిని మెజారిటీ ప్రజలు గుర్తించారు.. టీడీపీతో వున్న పొత్తు కూడా జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులకు అంత మెజారిటి రావటానికి కొంత కారణం.
Also Read : మరోసారి సింగర్‌గా మారిన బాలయ్య..!
ఏది ఏమైనా జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థులకు రాష్ట్రంలో మొదటి, రెండవ మెజారిటీ రావటంతో ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతృప్తి కలిగించింది. రాష్ట్రస్థాయిలో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సభ్యులే అత్యధిక మెజారిటీ సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా జనసేన పార్టీ సభ్యులు 30 వేల ఓట్ల మెజారిటీ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రకంగా ఇది టీడీపీ అధినేతలను కూడా కాస్త కలవరపాటుకు గురి చేసే విషయం. జనసేనకు మెజారిటీ రావడం.. తమ పార్టీ అభ్యర్ఖులు కొన్ని చోట్ల ఓడిపోవడం పై ఇప్పటికీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పవన్ పార్టీకి మెజారిటీ రావడం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


