Tuesday, November 10, 2026 02:14 PM
Tuesday, November 10, 2026 02:14 PM

పెట్రోల్ బంకులలో కొత్త మోసం.. పెట్రోల్‌కు బదులు నీళ్లు..!

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో ఉన్న ఒక ప్రముఖ హెచ్‌పీ పెట్రోల్ బంకులో వాహనదారులకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. బంకు యాజమాన్యం పెట్రోల్‌కు బదులుగా నీళ్లు కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తోందంటూ స్థానిక వాహనదారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్లే ఈ బిజీ రోడ్డులోని బంకులో ఇలాంటి మోసం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ మోసానికి గురైన ఒక బాధితుడు తన బైక్‌లో రూ. 520 విలువైన పెట్రోల్‌ను కొట్టించుకున్నాడు.

Also Read : బ్రేకింగ్: ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

అయితే, బంక్ నుంచి బయలుదేరిన కాసేపటికే అతని బైక్ మధ్యలోనే నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన వాహనదారుడు, సమీపంలోని మెకానిక్ షాప్‌నకు వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ మెకానిక్ బైక్ యొక్క ఫ్యూయల్ పైప్‌ను విప్పి చూడగా, పెట్రోల్ ట్యాంక్ నుండి భారీగా నీరు బయటకు కారడం చూసి షాక్‌కు గురయ్యాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాహనదారులు ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో ఆ పెట్రోల్‌ను పట్టి పరీక్షించారు. ఆ బాటిల్‌ను నిశితంగా గమనిస్తే పైన కొద్దిపాటి మోతాదులో మాత్రమే పెట్రోల్ తేలుతూ, కింద భాగమంతా పూర్తిగా నీళ్లే ప్రత్యక్షమయ్యాయి.

Also Read : సీట్లు కూటమికి.. కానీ ఓట్లు మాత్రం..!

ఈ కల్తీ ఇంధనం వల్ల బైక్ ఇంజిన్లు పూర్తిగా పాడైపోతున్నాయని, వేలాది రూపాయల నష్టం వాటిల్లుతోందని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ బంకుల్లో సాగుతున్న ఈ సరికొత్త మోసంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సదరు కల్తీ బంకుపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగి సదరు బంకులో తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఇలా డబ్బులు దారపోసి కొనుక్కుంటున్న పెట్రోల్‌లోనూ కల్తీ జరగడంపై సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పవన్ విడాకులపై వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్...

తెలంగాణాలో సంచలన తీర్పు.....

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది....

షర్మిల ఔట్.. ఏపీ...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ...

సీట్లు కూటమికి.. కానీ...

సీట్లు గెలిస్తే.. ఓటర్లంతా తన వైపే...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా...

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక...

పెద్ద నోట్ల రద్దుపై...

దేశంలో, రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని సమూలంగా...

పోల్స్