Tuesday, November 10, 2026 02:18 PM
Tuesday, November 10, 2026 02:18 PM

తెలంగాణాలో సంచలన తీర్పు.. కలెక్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష..!

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు గానూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ ఉన్నత న్యాయస్థానంలో డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

Also Read : బ్రేకింగ్: ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

ఈ వివాదం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నె ముత్యాలమ్మకుంట ప్రాంతంలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించినది. ఇక్కడి సర్వే నంబర్లు 536, 537, 657, 658లలోని తమకు చెందిన ప్లాట్ నంబర్ 59, 62 తూర్పు భాగాన్ని రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏ నుండి తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తమ ప్లాట్లకు ఆనుకుని ఉన్న ఇతర ల్యాండ్ పార్సెళ్లను ఇప్పటికే ఆ జాబితా నుంచి మినహాయించారని, కనుక సమాన ప్రాతిపదికన తమ భూములపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు, బాధితులు సమర్పించిన వినతిని పరిశీలించి 60 రోజుల్లోగా నిబంధనల ప్రకారం సముచిత నిర్ణయం తీసుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఒకవేళ వారి అభ్యర్థనను తిరస్కరిస్తే, అందుకు గల స్పష్టమైన కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఆ కాపీలను పిటిషనర్లకు అందజేయాలని స్పష్టం చేసింది. అయితే న్యాయస్థానం విధించిన గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో, బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : సీట్లు కూటమికి.. కానీ ఓట్లు మాత్రం..!

ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే స్పందించిన జిల్లా యంత్రాంగం, బాధితుల వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఒకే లేఅవుట్‌లోని పక్క ప్లాట్లను నిషేధిత జాబితా నుండి తొలగించి, ఈ పిటిషనర్ల విషయంలో మాత్రం భిన్నమైన వైఖరి అవలంబించడానికి సరైన కారణాలు లేవని పేర్కొంది. అధికారుల వివరణలో రికార్డులకు పొంతన లేకపోవడాన్ని తప్పుబడుతూ, గత కోర్టు ఉత్తర్వులు తప్పనిపిస్తే అప్పీల్‌కు వెళ్లాలి తప్ప, వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని జస్టిస్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం చెల్లదని, చట్టం ముందు ఎవరైనా సమానులేనని స్పష్టం చేస్తూ కలెక్టర్‌ను దోషిగా నిర్ధారించి ఈ శిక్షను ఖరారు చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పవన్ విడాకులపై వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్...

పెట్రోల్ బంకులలో కొత్త...

గుంటూరు నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో...

షర్మిల ఔట్.. ఏపీ...

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త రాజకీయ...

సీట్లు కూటమికి.. కానీ...

సీట్లు గెలిస్తే.. ఓటర్లంతా తన వైపే...

రిక్షావాలా MPTC.. ఆటోవాలా...

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక...

పెద్ద నోట్ల రద్దుపై...

దేశంలో, రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని సమూలంగా...

పోల్స్