Tuesday, November 10, 2026 06:35 AM
Tuesday, November 10, 2026 06:35 AM

ఈరోజు రాశి ఫలితాలు (10-11-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం.. 10-11-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి
————————–

వృషభం

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది
————————–

మిధునం

సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది
————————–

కర్కాటకం

వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఋణ భారం అధికమౌతుంది
————————–

సింహం

వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి. దీర్ఘకాలిక ఋణాల తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి
————————–

కన్య

ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు
————————–

తుల

వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది
————————–

వృశ్చికం

ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి
————————–

ధనస్సు

వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది
————————–

మకరం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు
————————–

కుంభం

వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి
————————–

మీనం

బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి
————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహన కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రిక్షావాలా MPTC.. ఆటోవాలా...

సామాన్యులకు ప్రజాస్వామ్యంలో స్థానం ఉందని స్థానిక...

పెద్ద నోట్ల రద్దుపై...

దేశంలో, రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన అవినీతిని సమూలంగా...

బ్రేకింగ్: ఉద్యోగులకు చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం...

ట్రేడింగ్ విండోలో గుజరాత్...

ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఫ్రాంచైజీల...

ఓట్ల శాతం, సీట్ల...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై...

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

పోల్స్