Saturday, November 7, 2026 02:58 PM
Saturday, November 7, 2026 02:58 PM

తెలంగాణ పల్లెలకు డిజిటల్ విప్లవం..!

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌గా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. సవరించిన భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కేంద్ర సమాచార శాఖ ఏకంగా రూ.3,189 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు న్యూఢిల్లీలోని సంచార్ భవన్‌లో డిజిటల్ భారత్ నిధి, కేంద్ర టెలికాం శాఖ, తెలంగాణ ప్రభుత్వం, టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ మరియు ట్రైకల్ సంస్థల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది.

Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?

ఈ బృహత్తర ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు అత్యంత వేగవంతమైన హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా మొదటి దశలో ఉన్న 1,946 గ్రామ పంచాయతీల నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసేలా లీనియర్ నుంచి రింగ్ టోపాలజీకి అప్‌గ్రేడ్ చేయనున్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన 36 గ్రామ పంచాయతీలతో పాటు ఫేజ్-2 లోని 10,787 పంచాయతీల పరిధిలోని సుమారు 3 లక్షల గ్రామీణ కుటుంబాలకు సరికొత్త హోమ్ ఫైబర్ కనెక్షన్లను అందించనున్నారు.

Also Read : వివాదాస్పదంగా మారిన మేడం గారి శాఖ..!

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామీణ కనెక్షన్‌కు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.10,000 చొప్పున సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందించడం విశేషం. ఈ సబ్సిడీ విభాగానికి మాత్రమే సుమారు రూ.300 కోట్ల నిధులను కేటాయించారు. ఈ హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానం వల్ల పల్లెటూళ్లలో ఈ-గవర్నెన్స్ సేవలు, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, పౌర సేవలు అత్యంత సులువుగా అందుబాటులోకి వస్తాయి. ఈ నెట్‌వర్క్ పనులను మరింత వేగవంతం చేసేందుకు ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో కొత్త ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ నిర్మాణానికి, పదేళ్ల పాటు దాని నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియకు కూడా అధికారికంగా ఆమోదం లభించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వరుసగా రెండవసారి.. పులివెందుల...

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

వివాదాస్పదంగా మారిన మేడం...

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన...

చీరాలలో వైసీపీ కొంపముంచిన...

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల...

అనంతపురంలో టెన్షన్ టెన్షన్.....

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల...

అసెంబ్లీ కంటే ఘోరం.....

ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు...

ఓటర్లకు ఈసీ బిగ్...

ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతైన...

పోల్స్