Friday, October 30, 2026 08:52 PM
Friday, October 30, 2026 08:52 PM

మున్సిపల్ పోరు వేళ హింసకు వైకాపా కుట్ర..?

ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ.. వైఎస్ఆర్ కడప జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గమైన పులివెందులలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా అట్టుడుకుతోంది. దశాబ్దాలుగా అక్కడ కొనసాగుతున్న ఏకపక్ష ఆధిపత్యానికి కూటమి పార్టీలు గట్టి బ్రేక్ వేయడంతో, పోయిన పట్టును తిరిగి సాధించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త స్కెచ్ వేసిందంటూ తెలుగుదేశం శ్రేణులు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. పులివెందుల మున్సిపల్ పరిధిలో అల్లర్లు సృష్టించి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు స్వయంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : టోల్‌ప్లాజా వాహనదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్..!

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే వైకాపా అగ్రనాయకత్వం ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడా ఏకగ్రీవాలు కావడానికి వీల్లేదని, ఒకవేళ ఏకగ్రీవాలు జరిగితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదంటూ స్థానిక వైకాపా నాయకులను జగన్ ముందే హెచ్చరించారు. అయితే క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. పులివెందుల నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, కూటమి పార్టీలు భారీగా పుంజుకున్నాయి. మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, 7 జెడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలను, అలాగే మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డుల్లో ఇప్పటికే 20 వార్డులను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా దక్కించుకుని వైకాపా కంచుకోటను బద్దలు కొట్టాయి.

గత 48 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గంలో నడుస్తున్న ఏకపక్ష రాజకీయాలకు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడటాన్ని వైకాపా లీడర్‌షిప్ జీర్ణించుకోలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఫలితం దక్కకపోవడంతో, ఆఖరికి ప్రజా కోర్టులో నిలబడటానికి భయపడి హింసా మార్గాన్ని ఎంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేపు స్వయంగా జగన్ పులివెందుల వెళ్లనుండటంతో, ఓటు వేయడానికి వచ్చే సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా రపరపా బ్యాచ్‌ లతో దాడులు చేయించడానికి ప్రణాళిక సిద్ధం చేశారని కూటమి నేతలు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో దాడులు చేసే ఈ విభాగానికి డైరెక్షన్ ఇచ్చే పూర్తి బాధ్యతలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించారని, ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను, గుండాలను ఇప్పటికే పులివెందులకు పిలిపించారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read : ఏపీ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!

“పులివెందులలో షర్ట్ మడత పెడితే రాష్ట్రం అట్టుడుకుతుంది” అంటూ జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఓటింగ్ రోజు జరగబోయే పరిణామాలపై వైకాపా ముందే హింట్స్ ఇచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. రేపు పులివెందులలో పెద్ద ఎత్తున అల్లర్లు జరగబోతున్నాయంటూ వైకాపా ముఖ్య నేతలు తమకు అనుకూలమైన జాతీయ మీడియాకు, రాష్ట్రంలో ఉన్న కొన్ని బ్లూ మీడియా ఛానళ్లకు ముందే సమాచారం చేరవేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లర్లు సృష్టించి పోలింగ్ ఆపడం ద్వారా తమ పరువు కాపాడుకోవాలని వైకాపా చూస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు పోలీస్ శాఖ పులివెందులలో భారీగా అదనపు బలగాలను రంగంలోకి దించి, ఓటింగ్ సాఫీగా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి శేణులు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీ తుఫాన్ రాజకీయాలు...

ఏపీలో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది....

టోల్‌ప్లాజా వాహనదారులకు కేంద్రం...

జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు...

ఏపీ ఎన్నికల సంఘం...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను...

ఏపీకి మరో ముప్పు.....

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల వణికించిన అర్నబ్ తుఫాను...

ఏపీ, తెలంగాణ.. సర్...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 6...

కష్టకాలంలో ఏపీకి అండగా...

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాన్ తీర...

పోల్స్