Sunday, October 25, 2026 10:06 AM
Sunday, October 25, 2026 10:06 AM

అమ్మో బ్లింక్ ఇట్.. కస్టమర్ల మైండ్ బ్లాక్..!

మహారాష్ట్రలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ వేర్‌హౌస్‌పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. భివాండిలోని బ్లింకిట్ గోడౌన్‌లో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు జరగడంతో అధికారులు ఆ సంస్థ ఫుడ్ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేశారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ సోదాల్లో అధికారులు దాదాపు 32.71 లక్షల రూపాయల విలువైన కాలం చెల్లిన, పాడైపోయిన సుమారు 18,405 ఆహార పదార్థాలను సీజ్ చేశారు.

Also Read : జగన్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?

నిబంధనల ప్రకారం అమ్ముడుపోని, ఎక్స్‌పైర్ అయిన ఈ అన్‌సోల్డ్ ఇన్వెంటరీని కంపెనీ పూర్తిగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. అయితే, బ్లింకిట్ యాజమాన్యం ఆ సరుకును నాశనం చేయకుండా, స్క్రాప్ వెండర్లతో చేతులు కలిపి మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి తెచ్చి కస్టమర్లకు విక్రయించేందుకు పెద్ద కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. ఈ మోసంపై అధికారులు భివాండి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంస్థ డైరెక్టర్లు, మేనేజర్లు, అలాగే వీరికి సహకరించిన స్క్రాప్ వెండర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసారు.

పది నిమిషాల్లో డెలివరీ పేరిట ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి సంస్థల తీరుపై మహారాష్ట్ర ప్రభుత్వం, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణం నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్‌లను వాడే వారి సంఖ్య కోట్లలో ఉంది.

Also Read : వైసీపీకి ఎన్నికలంటే యుద్ధమేనా..?

దీంతో మహారాష్ట్ర తరహాలోనే ఇక్కడి డార్క్ స్టోర్స్‌ లో కూడా ఎక్స్‌పైర్డ్ ఫుడ్ రీ సేల్ దందా ఏమైనా సాగుతుందా అనే కోణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.గతంలో కూడా హైదరాబాద్‌లోని పలు ఆన్‌లైన్ గ్రాసరీ గోడౌన్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ దాడులు చేసినప్పుడు పరిశుభ్రత లోపాలు, లేబ్లింగ్ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. తాజా ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని డార్క్ స్టోర్లపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఉమ్మడి ఆస్తిని నాది...

మాజీ సీఎం జగన్, ఆయన సోదరి...

షర్మిలకు జగన్ వివాదాస్పద...

బెంగళూరులోని వైయస్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక...

లోపల అసంతృప్తి.. పైకి...

కొందరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధికారిక...

కారు పార్టీలో అంతర్గత...

కారు పార్టీలో అంతర్గత విభేదాలు.. ఆధిపత్య...

జగన్ పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

రెబల్స్‌పై టీడీపీ సర్జికల్...

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

పోల్స్