- పాకిస్తాన్ తో గూఢచర్య కుట్రను ఛేదించిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్
- ఆపరేషన్ ఫైర్ వాల్‍తో బయటపడిన భారీ కుట్ర
భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన అంతర్గత భద్రతా వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా అత్యంత సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. దేశ రక్షణ రహస్యాలను శత్రుదేశానికి చేరవేస్తున్న ఒక పెద్ద పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్ గుట్టును ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం విజయవంతంగా రట్టు చేసింది. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఏపీ నిఘా వర్గాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ ఫైర్‌వాల్-2026 ను చేపట్టి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి.
Also Read : భారత క్రికెట్ లో సంచలన పరిణామం..!
ఈ ఆపరేషన్ కోసం ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కీలక అధికారులతో కూడిన 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు దేశంలోని మొత్తం 10 ప్రధాన రాష్ట్రాల్లో ఈ నిఘా బృందాలు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వ్యక్తుల ప్రతి కదలికను అత్యంత నిశితంగా గమనిస్తూ, అనుమానిత స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఈ స్పై నెట్‌వర్క్ యొక్క మూలాలను అధికారులు చేధించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
Also Read : ఏపీ ఎన్నికల పైనే ఎందుకింత అనుమానం..?
కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాల ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన పలువురు అనుమానితులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన, వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించి సరిహద్దులు దాటించడమే ఈ నెట్‌వర్క్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ రంగానికి చెందిన కీలక డేటాను సాధారణ మార్గాల్లో కాకుండా, పట్టుబడకుండా ఉండేందుకు అత్యంత సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ ఛానళ్ల ద్వారా పాక్ హ్యాండ్లర్లకు చేరవేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నిందితులు వాడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, మరియు ల్యాప్‌టాప్‌లను సీజ్ చేసిన అధికారులు.. వారు ఏ రకమైన సమాచారాన్ని అవతలి వైపుకు పంపారనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సైబర్ నిపుణుల సాయంతో ఈ డేటాను డీకోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.


