Friday, October 2, 2026 07:34 PM
Friday, October 2, 2026 07:34 PM

ఫ్లైదుబాయ్ విమానం కూల్చే కుట్ర వెనుక ఇరాన్ హస్తం..?

దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భారత కెప్టెన్ స్మిత్ మఛ్ఛార్‌పై కత్తితో దాడి చేయడానికి ఒమన్ జాతీయుడైన కో-పైలట్ చేసిన ప్రయత్నం వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేసారు. ఈ ఘటనపై ఇరాన్ లింకుల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తమ నిఘా సంస్థలు ప్రస్తుతం దీనిపైనే విచారణ జరుపుతున్నాయని, ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరాన్ ప్రమేయం ఉండే అవకాశం “అవును” అనేలానే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read : వైసీపీ నేతలను వేటాడుతున్న ఈడీ..!

ఒకవేళ ఈ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు ఆధారాలతో రుజువైతే, ఇరాన్‌పై అమెరికా అత్యంత కఠినంగా విరుచుకుపడుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ దాడికి ఒడిగట్టిన కో-పైలట్‌ను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ముందే ప్లాన్ ప్రకారం విమానంలోకి చొప్పించిందా లేదా అతను ఆ తర్వాత ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి గురై ఈ పని చేశాడా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని ట్రంప్ వివరించారు. ఇదే సమయంలో, కో-పైలట్ జరిపిన అనాగరిక కత్తి దాడిని ప్రాణాలకు తెగించి అడ్డుకున్న భారత కెప్టెన్ స్మిత్ మఛ్ఛార్‌ను ట్రంప్ ఒక హీరోగా కొనియాడారు.

Also Read : వైసీపీ పెద్ద తలకాయలపై గురిపెట్టిన ఈడీ..!

గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపులు తెరిచి, విమానంలోని ఇద్దరు రిజర్వ్ పైలట్లు, ప్రయాణికుల సహాయంతో కో-పైలట్‌ను లొంగదీసుకోవడం వల్లే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కాయని, విమానం భారీ విపత్తు నుండి తప్పించుకుందని కొనియాడారు. మరోవైపు, ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు కాస్త ఆచితూచి స్పందించారు. కో-పైలట్‌కు ఇరాన్‌తో కానీ, మరే ఇతర సంస్థలతో కానీ సంబంధాలు ఉన్నాయని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అయితే, సదరు కో-పైలట్ తీవ్రమైన ఇస్లామిక్ సంప్రదాయవాద భావజాలంతో ప్రభావితుడయ్యాడని అతని వ్యక్తిగత సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోందని నెతన్యాహు వెల్లడించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమలు లోకి కొత్త...

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే...

Don’t Trouble The...

ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన...

వైసీపీ వెర్సస్ ఇండియా...

ఇటీవల నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్...

వైసీపీ పెద్ద తలకాయలపై...

2019 సంచలనం సృష్టించిన మాజీ మంత్రి...

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

పోల్స్