Friday, October 2, 2026 08:03 PM
Friday, October 2, 2026 08:03 PM

లిక్కర్ స్కామ్.. జగన్ అరెస్టు అంత వీజీ కాదేమో..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణం విచారణ కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణం పేరుతో వేల కోట్ల వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్‌డీ సత్యప్రసాద్‌తో పాటు ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వంటి కీలక అధికారులు కోర్టుకు, దర్యాప్తు సంస్థ సిట్‌కి ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ దందా మొత్తం నాటి సీఎంవో కనుసన్నల్లోనే జరిగిందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాలతోనే నిబంధనల ఉల్లంఘనలు, ముడుపుల వ్యవహారం నడిచిందని వాంగ్మూ లంలో పేర్కొనడం రాజకీయ సంచలనానికి దారితీసింది.

Also Read : ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు..!

అంతేకాకుండా, అంతిమ లబ్దిదారు జగన్ మోహన్ రెడ్డి అని సత్యప్రసాద్ ఏకంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమవ్వడం కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. చట్టపరమైన కోణంలో విశ్లేషిస్తే, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 183 కింద మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసే అధికారుల వాంగ్మూలానికి న్యాయస్థానంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. పోలీసులకు ఇచ్చే వాంగ్మూలంతో పోలిస్తే, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చే వాంగ్మూలాన్ని సాక్షులు లేదా అధికారులు అనంతరం మార్చడానికి వీలుండదు. కాబట్టి రజత్ భార్గవ, సత్యప్రసాద్ వంటి ఉన్నతాధికారులు తాము ఒత్తిడికి గురయ్యామని, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫైళ్లపై సంతకాలు చేశామని మెజిస్ట్రేట్ వద్ద ధృవీకరిస్తే, అది చట్టప్రకారం ప్రధాన నిందితులకు, కుట్రదారులకు చుట్టుముట్టే బలమైన ప్రాథమిక సాక్ష్యంగా మారుతుంది.

Also Read : ఈ ఏడాది చలికాలం ఉండదా..? వాతావరణ శాఖ ఏం చెబుతుంది..?

కేవలం అధికారుల, సహ నిందితుల వాంగ్మూలాలు మాత్రమే ఒకరిని దోషిగా తేల్చడానికి లేదా ఈ కేసులో వైఎస్ జగన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చి శిక్ష పడేలా చేయడానికి సరిపోవు. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం, అప్రూవర్ లేదా ప్రత్యక్ష సాక్షి చెప్పే మాటలకు మద్దతుగా స్వతంత్ర సాక్ష్యాలు తప్పనిసరి. కేవలం ఒక అధికారి.. సీఎం చెప్పారు అని వాంగ్మూలం ఇచ్చినంత మాత్రాన కోర్టు ఆమోదించదు. ఆ మాటలను నిరూపించేందుకు నాటి సీఎంవో ఫైల్స్, ఐఏఎస్ అధికారులకు పంపిన అంతర్గత మెమోలు, డిజిటల్ సాక్ష్యాలు సీఎంవో అధికారుల అధికారిక సమీక్షల నిమిత్తం నమోదైన మినిట్స్ ఆఫ్ మీటింగ్ వంటి రికార్డులను దర్యాప్తు సంస్థలు కోర్టు ముందుంచాల్సి ఉంటుంది.

ఇక ఈ కేసులో అత్యంత సంక్లిష్టమైన అంశం నగదు లావాదేవీల నిరూపణ . లిక్కర్ స్కామ్‌లో వేల కోట్ల రూపాయల ముడుపులు మారాయని ఆరోపిస్తున్నప్పుడు, ఆ డబ్బు ఎక్కడి నుండి బయలుదేరింది, ఏ హవాలా, బ్యాంకింగ్ మార్గాల ద్వారా పయనించింది, చివరకు అది జగన్‌ మోహన్ రెడ్డికి లేదా ఆయన కుటుంబ సంస్థలకు, ట్రస్టులకు ఎలా చేరింది అనే విషయాన్ని పక్కాగా నిరూపించాల్సి ఉంటుంది. ఒకవేళ కేవలం అధికారులు రూ.3200 కోట్లు జగన్‌కు చేరాయి అని వాంగ్మూలంలో చెప్పినప్పటికీ, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రయిల్, ఆస్తుల జప్తు లేదా డిజిటల్ ప్రూఫ్స్ చూపించకపోతే, కేసు విచారణ దశలో చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది.

Also Read : తాడేపల్లి టు ఢిల్లీ వయా సీపీఐ.. కాంగ్రెస్ కోసమే..?

ప్రస్తుతం సిట్, దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న వ్యూహం ప్రకారం.. ముందస్తుగా అధికారుల నుంచి కుట్ర కోణాన్ని సేకరించి, ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, మనీ లాండరింగ్ కోణాల్లో నిధులను వెలికితీసే పనిలో ఉన్నారు. అధికారులను బెదిరించి లేదా ఒత్తిడి తెచ్చి సీఎంవో బాధ్యత వహించేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆధారాలు లభిస్తే, కుట్రలో భాగస్వామిగా, లబ్ధిదారుగా జగన్‌ను కేసులో ఏ1 గా చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాజీ అధికారుల వాంగ్మూలాలు కేసును మలుపు తిప్పిన మాట నిజమే అయినా, అది జగన్ మోహన్ రెడ్డి అరెస్టు లేదా ఏ 1గా మార్చేందుకు కేవలం ఒక సపోర్టింగ్ పిల్లర్ మాత్రమే. ఈ వాంగ్మూలాల ఆధారంగా ప్రభుత్వం, సీఐడీ లేదా సిట్ బృందాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు పక్కాగా నగదు మార్పిడి రికార్డులు, డిజిటల్ ఆధారాలు, హవాలా లింకులను కోర్టు ముందు ఉంచుతాయో అనే దానిపైనే ఈ కేసు భవిష్యత్తు, జగన్ లీగల్ భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

టీటీడీ చైర్మన్‌గా మరో...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర...

అమలు లోకి కొత్త...

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే...

Don’t Trouble The...

ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన...

వైసీపీ వెర్సస్ ఇండియా...

ఇటీవల నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్...

వైసీపీ పెద్ద తలకాయలపై...

2019 సంచలనం సృష్టించిన మాజీ మంత్రి...

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

పోల్స్