Tuesday, September 29, 2026 08:15 PM
Tuesday, September 29, 2026 08:15 PM

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్..!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫార్ములా-ఈ రేసు వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తక్షణమే జప్తు చేయాల్సిందిగా నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read : కూచిపూడి రంగప్రవేశంతో ఆకట్టుకున్న ఖ్యాతి పుట్టా

ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో నిందితులు ఎవరూ కూడా దేశం విడిచి విదేశాలకు వెళ్లకుండా ముందస్తుగా నిరోధించేందుకే ఏసీబీ అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారని తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల పాస్‌పోర్టులను సీజ్ చేయాలంటూ హైదరాబాద్ రీజినల్ పాస్‍పోర్ట్ ఆఫీసర్ కు ఏసీబీ న్యాయస్థానం అధికారికంగా లేఖ రాసింది. ఈ పరిణామంతో మాజీ మంత్రి కేటీఆర్‌కు విదేశీ ప్రయాణాల పరంగా పెద్ద షాక్ తగిలింది.

Also Read : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు

గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణ సంస్థకు మళ్లించారనే తీవ్రమైన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు జరుపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు కాగా, విచారణ మరింత వేగవంతం అయింది. ఈ క్రమంలో కోర్టు నుంచి వచ్చిన ఈ సంచలన ఆదేశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ టూ జనసేన.....

వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది....

రకుల్ ప్రీత్ సింగ్...

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో...

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

పోల్స్