Monday, September 28, 2026 08:13 PM
Monday, September 28, 2026 08:13 PM

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు

సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటి అధికారులు సోదాలు మొదలుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం దాటిన తర్వాత ఐటీ అధికారులు ఒక్కసారిగా బృందాలుగా విడిపోయి 12 ప్రాంతాలలో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. సినిమా ఫైనాన్సింగ్ పేరుతో నిధులను మళ్లించారని తెలుస్తోంది. ఇలా నిధులు మళ్లింపు విషయంలో కొన్ని కీలక విషయాలను దాచిపెట్టడం ఐటి అధికారులకు అనుమానం కలిగించింది. దీంతో కొద్దిరోజులుగా వారు లోతుగా ఈ వ్యవహారాన్ని తవ్వుతున్నారు. దీంట్లో అనుమానాస్పద లావాదేవీలు కనిపించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు.

Also Read : జగన్ ఎవరి చేతిలో కీలు బొమ్మ..?

రకుల్ మామ వషూ భగ్నాని కార్యాలయంలో కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. రకుల్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కీలకమైన పత్రాలు.. రికార్డులను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అప్పట్లో రకుల్ సోదరుడు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అయితే ప్రస్తుతం రకుల్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్.. బాలీవుడ్..లో సరికొత్త చర్చ మొదలైంది. రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ఆమె నటించిన సినిమాలు విజయవంతం అయ్యాయి. దీంతో టాలీవుడ్లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకుంది.

Also Read : ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ పాలనకు రిఫరెండమా..?

ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాఫ్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయింది. ఇదే అనే పద్యంలో ఆమె కొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్ఆపుడు దాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రకుల్ ప్రీత్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో ఆమె సోదరుడి మీద రకరకాల విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని వ్యవహారాలు ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి. అయినప్పటికీ ఆమె వాటిని తట్టుకొని నిలబడింది. కానీ చివరికి ఇప్పుడు ఏకంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేయడం చర్చకు దారి తీసింది. మరి ఈ దాడుల్లో అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారు.. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.. అనే వాటిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అల్లు శిరీష్: ఒక్క...

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం...

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

పోల్స్