ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం సభ్యుల్లో కీలు బొమ్మలుంటారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి రాజారెడ్డి, కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా.. ఏ ఒక్కరి చేతిలో కీలుబొమ్మలు కారని ఆ ముగ్గురి గురించి తెలిసిన టీడీపీ నాయకులు అంటుంటారు. ఆ ముగ్గురు కొందరిని మాత్రమే నమ్ముతారని.. అన్నీ పనులు వారి ద్వారా మాత్రమే చక్కబెట్టుకుంటారని.. ఆ పనుల విలువ ఎంతైనా కూడా అదే రోజు సాయంత్రానికి ఆ విలువను సరిచేసుకుంటారని.. ఆ ముగ్గురి మనస్తత్వం తెలిసిన వారే చెబుతుంటారు. అప్పుడు వైఎస్ఆర్ కానీ… ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కానీ.. ఒకరిద్దరినే నమ్మే వారు. వారి ద్వారానే ఆర్ధిక వ్యవహారాలు, ఏ రోజు లెక్కలు.. అదే రోజే సరిచేసుకునే వారని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read : జగన్ మునిగితే తాను మునుగుతా అనే సాయి రెడ్డి భయమా..?
అందుకు నిదర్శనం ఏమిటంటే.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అత్యంత నమ్మకస్తుడైనా రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావుకే ఆర్ధిక పరమైన పనులు అప్పజెప్పినా.. ఏ రోజు లెక్కలు అదే రోజు సాయంత్రానికి పూర్తి చేశారంట. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించిన తర్వాత కూడా ఎక్కడా ఆర్ధిక సంబంధమైన గొడవలు జరగలేదు. వైఎస్ఆర్ హయాంలో ఏమేమి జరిగిందో.. ఎన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి సంపాదించుకున్నారనే విషయం సీబీఐ అధికారులే బయటపెట్టారు. వైఎస్ఆర్ మరణించి తప్పుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి దొరికిపోయారని అప్పట్లో సీబీఐ అధికారులే ఆఫ్ ది రికార్డు కామెంట్లు చేసిన సందర్భాలున్నాయి.
అన్ని జాగ్రత్తలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్నారని అప్పట్లో సీబీఐ, ఈడీ అధికారులు వ్యాఖ్యానించారు కూడా. అందుకే తండ్రి వైఎస్ఆర్ బాటలోనే తనయుడైన జగన్ మోహన్ రెడ్డి కూడా నడిచారు. ఎక్కడా ఆర్ధిక పరమైన విషయాలు బయటపడటం లేదు. వైఎస్ఆర్ కానీ, జగన్ మోహన్ రెడ్డి కానీ ఏ ఒక్కరి చేతిలో కీలుబొమ్మలు కాదనే విషయం అర్థం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి రెండేళ్లు దాటినా కూడా.. ఎక్కడా ఆయన ఏ విషయంలో కూడా నేరుగా ఇన్వాల్వ్ అయినట్లు ఏ ఒక్కరు కనిపెట్టలేకపోయారు. అలా ఉంటుంది జగన్ రెడ్డి ముందు జాగ్రత్త. ఇవన్నీ విజయసాయి రెడ్డికి కూడా బాగా తెలుసు.
Also Read : నేను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు.. కోహ్లీ కీలక ప్రకటన..!
సజ్జల చేతిలో జగన్ మోహన్ రెడ్డి కీలుబొమ్మ అని విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదు. జగన్ మోహన్ రెడ్డి కొందర్ని మాత్రమే నమ్మి.. వారి ద్వారా ఆర్ధిక లావాదేవీలను చక్కబెట్టుకుంటారే తప్ప.. ఆయన ఏ ఒక్కరి చేతిలో కీలుబొమ్మ కాదన్నది విజయ సాయిరెడ్డికి బాగా తెలుసు. ఏదో అనాలి కాబట్టి.. నోటికొచ్చింది అన్నారే తప్ప.. అందులో ఏ మాత్రం నిజాలు లేవు అనేది అందరికీ తెలిసిన విషయమే. తండ్రి వైఎస్ఆర్కు కేవీపీ అత్యంత నమ్మకస్తుడు.. అలాగే తనయుడు జగన్ మోహన్ రెడ్డికి సజ్జల మాత్రమే నమ్మకస్తుడు.. అనేది వారిని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు.
వాళ్ల నమ్మకానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఏమిటనేది అప్పుడు కేవీపీకి.. ఇప్పుడు సజ్జలకు మాత్రమే తెలుసు. విజయ సాయిరెడ్డి చేసిన విమర్శల్లో మిగతా విషయాల్లో నిజాలు ఉండవచ్చేమో కానీ.. సజ్జల చేతిలో జగన్ మోహన్ రెడ్డి కీలుబొమ్మ అనే విమర్శలో ఏ మాత్రం “పస” లేదని కొందరు వైఎస్ కుటుంబ సభ్యులే చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఏమిటీ.. ఒకరి చేతిలో కీలుబొమ్మగా ఉండటం ఏమిటి.. అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

