Friday, September 25, 2026 08:43 PM
Friday, September 25, 2026 08:43 PM

పవన్-రాధా భేటీ వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్..?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ విజయవాడ రాజకీయం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ జరిపిన భేటీ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు పక్కపక్కనే నిలబడి నవ్వుతూ దిగిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదని, దీని వెనుక రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ ఉందనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.

Also Read : బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్ పై కాక్రోచ్ గురి..!

పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వంగవీటి రాధాను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాలని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ, కూటమి విజయం కోసం రాధా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఆయనకు తగిన గుర్తింపు ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది.

అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయవాడ మేయర్ పీఠాన్ని వంగవీటి రాధాకు కేటాయించాలని, దీని ద్వారా నగరంలో వైఎస్సార్‌సీపీని పూర్తిగా దెబ్బతీయాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. అయితే, విజయవాడ నగరంలో వంగవీటి రాధా మేయర్ అభ్యర్థిగా విజయం సాధించాలంటే కేవలం టీడీపీ బలం మాత్రమే సరిపోదు. అక్కడ జనసేన పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, యువత మరియు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ మద్దతు అత్యంత కీలకం.

Also Read : రొమాంటిక్ ట్రాప్‌.. వలలో చిక్కిన లాయర్..!

ఈ నేపథ్యంలోనే, పొత్తులో భాగంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వస్తే జనసేన శ్రేణులు ఆయనకు బేషరతుగా మద్దతు ప్రకటించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే పవన్ కల్యాణ్‌తో ఈ భేటీ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ క్రేజ్, వంగవీటి రంగా వారసత్వం కలిస్తే బెజవాడలో కూటమికి తిరుగుండదనే వ్యూహంతోనే ఈ పొలిటికల్ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోల్స్