Thursday, September 24, 2026 02:22 PM
Thursday, September 24, 2026 02:22 PM

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి భారీ వర్షం కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడటం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. బుధవారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ విమానం, షెడ్యూల్ ప్రకారం రాత్రి 9:40 గంటలకు భోగాపురంలో దిగాల్సి ఉంది. అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా ఎయిర్‌పోర్ట్‌లోని సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

Also Read : టీచర్లను కొట్టినా 24 గంటల్లో బెయిల్..!

దీంతో రన్ వేపై ల్యాండింగ్ సాధ్యపడక పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విమానంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌లతో పాటు పలువురు ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం ఏమాత్రం సహకరించకపోవడంతో విమానాశ్రయ ఏటీసీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా విమానాన్ని మహారాష్ట్రలోని నాగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించాలని పైలట్లకు ఆదేశాలు ఇచ్చారు.

Also Read : నెయ్యి ఎక్కువ తింటే గుండెపోటు ఖాయమా..?

దాదాపు రెండు గంటల పాటు ఆకాశంలోనే తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు విమానం నాగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో మంత్రులు, ప్రయాణికులు సహా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాగపూర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయిన అనంతరం పరిస్థితిని సమీక్షించిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.. ఆ విమానాన్ని అక్కడి నుంచి బెంగళూరుకు, ఆ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి సురక్షితంగా విజయవాడకు తరలించింది. ప్రయాణికులందరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

పోల్స్