Thursday, September 24, 2026 12:49 PM
Thursday, September 24, 2026 12:49 PM

పిఠాపురంలో పవన్ మార్క్.. గంటల్లో సమస్యలు పరిష్కారం..!

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై స్పందించిన విధానంపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఎదుర్కొంటున్న పలు సుదీర్ఘకాల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇస్తూ, వివిధ అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారు. ఇందులో భాగంగా అమరవిల్లి, కొమరగిరి, గోర్స, నవఖండ్రవాడ, చేబ్రోలు, దుర్గాడ గ్రామాల్లో 6 నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.1.92 కోట్లు, అలాగే నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి మరో రూ.1.50 కోట్లను కేటాయించారు.

Also Read : శీనన్న.. ఇలా అడ్డంగా బుక్ అయ్యావేందన్నా..!

మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారీగా నిధులు కేటాయించారు. ఎఫ్‌కే పాలెంలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.1.35 కోట్లు, కొండెవరంలో ప్రధాన సీసీ డ్రైనేజీకి రూ.1.20 కోట్లు, చందుర్తి కమ్యూనిటీ హాల్‌కు రూ.25 లక్షలు, సర్పవరం సీసీ రోడ్డుకు రూ.6 లక్షలు, వాకతిప్ప డ్రైనేజీకి రూ.10 లక్షలు మంజూరు చేశారు. గొల్లప్రోలు పారిశుధ్య నిర్వహణ కోసం రూ.25 లక్షలతో జేసీబీని కేటాయించడమే కాకుండా, కొండెవరంలో 11 కేవీ విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు.

Also Read : నెయ్యి ఎక్కువ తింటే గుండెపోటు ఖాయమా..?

మరియు పిఠాపురం-రాజమండ్రి మధ్య కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వలస కూలీలకు తాగునీరు, వసతి, విద్యుత్, రేషన్ సౌకర్యాలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు పవన్ కళ్యాణ్ సూచనలు చేసారు. అలాగే పింఛన్ల కోసం వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

ఖైరతాబాద్.. గులాబీ పార్టీకి...

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత...

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

బ్రేకింగ్: విజయసాయి రెడ్డి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన...

పోల్స్