Wednesday, September 23, 2026 04:40 PM
Wednesday, September 23, 2026 04:40 PM

బ్రేకింగ్: విజయసాయి రెడ్డి ఛానల్ పేరు ఇదే..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణపై తీవ్ర ఉత్కంఠను రేపిన మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇప్పుడు కొత్తగా మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. తన సొంతంగా ప్రారంభించబోతున్న కొత్త మీడియా వేదికకు ‘VSR Media’ అనే పేరును ఖరారు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.
విజయసాయిరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “VSR Media” అనే పేరుతో ఉన్న ఒక పోస్టర్‌ను స్టోరీ రూపంలో పోస్ట్ చేశారు.

Also Read : సిఎం మెడకు చుట్టుకున్న చిల్లర గాళ్ళ రచ్చ..!

దీనితో సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి రాజకీయ పరిణామాల అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న ఆయన, తన ఆలోచనలను, విశ్లేషణలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే డిజిటల్ మాధ్యమం ద్వారా ఈ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం, ముఖ్యంగా వ్యూహ రచనలో తనదైన ముద్ర వేసిన విజయసాయిరెడ్డి స్థాపించిన ఈ కొత్త వేదిక ద్వారా ఎలాంటి వార్తలు, కథనాలు, రాజకీయ విశ్లేషణలు అందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!

‘VSR Media’ అనేది ఒక డిజిటల్ న్యూస్ పోర్టలా, యూట్యూబ్ ఆధారిత నెట్‌వర్కా లేదా పూర్తి స్థాయి మీడియా సంస్థా అనే విషయాలపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మీడియా వేదిక ద్వారా ఆయన రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాత్మక విషయాలను బయటపెడతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ మీడియా అడుగులు మున్ముందు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

పోల్స్