Thursday, September 17, 2026 08:00 PM
Thursday, September 17, 2026 08:00 PM

ఆటో మార్కెట్‌లో మారుతి సుజుకి భారీ ప్లాన్..!

భారత ఆటోమొబైల్ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మారుతి సుజుకి, దేశీయ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా మార్చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే 2031 నాటికి ఏకంగా 7 కొత్త ఎస్‌యూవీలను, 5 సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలాను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Also Read : కూటమిలో చిచ్చు పెట్టిన కాంక్లేవ్..!

మారుతి సుజుకి కేవలం ఒకే రకమైన సెగ్మెంట్‌కు పరిమితం కాకుండా, విభిన్న సాంకేతికతలతో కూడిన వాహనాలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. పర్యావరణ హితమైన మొబిలిటీ వైపు ఇండియా అడుగులు వేస్తున్న తరుణంలో.. సీఎన్‌జీ, హైబ్రిడ్స్, మరియు ఈవీలు అన్నీ కలిపి ఒకే పోర్ట్‌ఫోలియోలో ఉండేలా కంపెనీ మల్టీ-పవర్‌ట్రెయిన్ విధానాన్ని అనుసరిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సరికొత్త ‘2026 బ్రెజ్జా’ మరియు లెవెల్ 2 ADAS ఫీచర్లతో అప్‌డేట్ అయిన ‘2026 బెలేనో’ మోడళ్లు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Also Read : రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ పంచాయతీ..!

మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్లో మారుతి సుజుకి ఇ విటారా కార్‌తో అడుగుపెట్టనుంది. ఇది 49kWh మరియు 61kWh బ్యాటరీ ఆప్షన్లతో, ఒకే ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 3-రో ఎలక్ట్రిక్ మోడల్ కార్ 2027 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. మూడు వరుసల సీట్లు కలిగిన పెద్ద ఎలక్ట్రిక్ వాహనంగా దీన్ని తీసుకు వస్తున్నారు. ‘YMC’ అనే కోడ్‌నేమ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ వాహనాన్ని e-HEARTECT ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా మోడల్ ఆధారంగా ఒక సరికొత్త సెవెన్-సీటర్ SUVని కూడా లైన్‌అప్‌లోకి తీసుకురానున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్