రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారీ కన్నీళ్లే సమాధానంగా మారుతున్నాయా..? వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి పెట్టుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మూడు రోజుల్లో రెండు సార్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇది నిజమైన ఆవేదన లేక రాజకీయ సానుభూతి కోసం మరో ఎపిసోడా అనే చర్చ మొదలైంది. విజయనగరం జిల్లా వైసీపీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు బొత్సను తీవ్రంగా కలిచివేశాయి. జిల్లాలో బొత్స చేసిన సేవలను ప్రస్తావించిన అమర్నాథ్ ఆయన కుటుంబ సభ్యుడైన మేనల్లుడు, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన బొత్స కంటతడి పెట్టుకున్నారు.
Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!
అయితే బొత్స కన్నీళ్ల పైన ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని పదే పదే చెప్పే బొత్స.. తనకు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా భావోద్వేగాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలచుకుని కన్నీరు పెట్టిన బొత్స.. తాజాగా మేనల్లుడి రాజకీయ నిర్ణయంతో మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. మూడు రోజుల క్రితం గరివిడి మండలంలో జరిగిన రాజకీయ పరిణామాలపై నిర్వహించిన సమావేశంలో కూడా బొత్స కంటతడి పెట్టారు. మేనల్లుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం ఆయనకు తీవ్ర ఆవేదన కలిగించినట్లు కనిపించింది. ఇప్పుడు అదే అంశం తెరపైకి రావడంతో బొత్స కన్నీళ్లు రాజకీయ చర్చకు కారణమయ్యాయి.
Also Read : బ్రేకింగ్.. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
నమ్మిన వారే మోసం చేశారంటూ బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే రాజకీయంగా బలమైన నాయకుడిగా పేరున బొత్స ప్రత్యర్థుల దాడులను ఎదుర్కొనేందుకు కన్నీళ్లను అస్త్రంగా మార్చుకుంటున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లాలో తనదైన రాజకీయ ముద్ర వేసిన బొత్స.. ఇప్పుడు సొంత కుటుంబంలోనే రాజకీయ విభేదాలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారం ఉన్నప్పుడు ఒకలా రాజకీయంగా పరిస్థితులను మారిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఆయనపై వినిపిస్తున్నాయి. మొత్తానికి మూడు రోజుల్లో రెండుసార్లు కన్నీళ్లు.. మేనల్లుడి పార్టీ మార్పు.. నమ్మిన వారే మోసం చేశారన్న ఆవేదన.. బొత్స రాజకీయ ప్రయాణంలో కొత్త చర్చకు తెరతీశాయి.
Also Read : లోకల్‌లో జనసేన దూకుడు.. టీడీపీ బ్రేకులు..!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వరుసగా రెండుసార్లు కంటతడి పెట్టుకున్నప్పటికీ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం కనీసం స్పందించిన దాఖలాలు కనిపించలేదనే చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మేనల్లుడు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం.. అనంతరం పార్టీ సమావేశంలో భావోద్వేగానికి గురికావడం జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా జగన్ నుంచి ఓ పరామర్శ కానీ.. ఓ బహిరంగ స్పందన గానీ లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు బొత్స కన్నీళ్లు.. మరోవైపు జగన్ మౌనం.. ఇదేనా వైసీపీలో సీనియర్ నేతలకు దక్కుతున్న గౌరవం అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.
బొత్స ఆవేదనను పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదన్న భావన కూడా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా బొత్స సత్యనారాయణ కన్నీళ్ళ ఆవేదన ఓవైపు కొనసాగుతుండగానే ఆయన మేనల్లుడు చిన్న శ్రీను మాత్రం టీడీపీలో తన రాజకీయ ప్రయాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన చిన్న శ్రీను తాజాగా టీడీపీ సీనియర్ నేత, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. బొత్స కన్నీళ్లను ఏమాత్రం లెక్కచేయకుండా టీడీపీలో పెద్దల ఆశీస్సులతో చిన్న శ్రీను ముందడుగు వేస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది చంద్రబాబు, లోకేష్ సూచనలు.. పార్టీ సీనియర్ల మార్గదర్శకంలో పని చేస్తానని చిన్న శ్రీను ఇప్పటికే స్పష్టం చేశారు. బొత్స వేదన.. మరోవైపు చిన్న శ్రీను టీడీపీలో కొత్త అడుగులు విజయనగరంలో మామ మేనల్లుడి రాజకీయ దారులు ఇప్పుడు పూర్తిగా వేరువేరుగా మారాయి.

