తెలుగు రాష్ట్రం ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అలా జరిగి పుష్కర కాలం దాటింది కూడా. అయినా సరే.. ఇప్పటికీ అదే అక్కసు.. అదే అసహనం.. ఇంకా చెప్పాలంటే.. ఎక్కడ రాజకీయంగా బలపడుతుందో అనే భయం.. ఇవన్నీ ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పటి భారత రాష్ట్ర సమితి అనే గులాబీ పార్టీ నేతల్లో ఉన్న భయం. ఆ భయం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించే. 1999లో చంద్రబాబు ఇచ్చిన బీ ఫారం తీసుకుని తెలుగుదేశం పార్టీ పార్టీ సైకిల్ గుర్తు పైన పోటీ చేసి గెలిచారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్. అయితే ఆ సమయంలో చంద్రబాబు మంత్రిపదవికి బదులుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో.. తెలంగాణ మొత్తానికి అన్యాయం అంటూ గగ్గొలు పెట్టారు.
Also Read : లోకల్‌లో జనసేన దూకుడు.. టీడీపీ బ్రేకులు..!
ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ముందు ఓ ఉద్యమ పార్టీ మొదలుపెట్టి.. ఆ తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చేశారు. నిజానికి ప్రత్యేక రాష్ట్రం పేరుతో మొదలుపెట్టిన పోరాటం.. ఆ తర్వాత రాజకీయ మనుగడ కోసమే అని తేలిపోయింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు.. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం.. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు.. ఆ తర్వాత అదే పార్టీతో విభేదాలు. కేవలం రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అన్నందుకే చంద్రబాబుపై నాటి గులాబీ పార్టీ నేతలు దుమ్మెత్తి పోశారు. చివరికి తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర కూడా వేశారు. ఇక 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అదే అక్కసును తెలుగుదేశం పార్టీ అధినేతపైన వెళ్ళగక్కారు.
Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు
చివరికి 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు, వైసీపీని గెలిపించేందుకు నాటి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. టీడీపీకి వ్యతిరేకంగా కులాల మధ్య చిచ్చు పెట్టారు. కుల సంఘాల మీటింగ్‌లో పాల్గొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చివరికి వైసీపీ గెలిచిన తర్వాత సంబరాలు కూడా జరుపుకున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి తెలుగుదేశం పార్టీ కారణమనేది గులాబీ పార్టీ నేతల మాట. చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు చోట్ల టీడీపీ అభిమానులు ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఉంటే.. మీ రాష్ట్రంలో చేసుకోండి.. అంటూ తెలుగు వారిని వేరు చేసే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి.
Also Read : ప్రతిపక్ష నేతగా తలసాని.. మహేష్ గౌడ్ సంచలన కామెంట్స్..!
మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపులో రేవంత్ రెడ్డి కీలకం. కాంగ్రెస్ గెలిచిన తర్వాత రేవంత్ ర్యాలీలో కొందరు టీడీపీ జెండాలను కూడా ఎగురవేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ పైన కోపం ఇంకాస్త పెంచుకున్నారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిస్థాయిలో పోటీ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. అయినా సరే.. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలకు చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన కోపం పోలేదు. తాజాగా మాక్ అసెంబ్లీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు.. చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రెచ్చిపోయారు. “మా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు డబ్బులు.. వాళ్ల సోషల్ మీడియా వల్లే.. చంద్రబాబు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాం.” అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో.. చంద్రబాబును వాడు, వీడు అంటూ సంభోదించారు. అవసరమైతే మోదీతో మాట్లాడగలడు.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు పల్లా. అలా ఓ ముఖ్యమంత్రి గురించి అగౌరవంగా మాట్లాడుతుంటే.. పక్కనే ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు పగలబడి నవ్వారు తప్ప.. ఇది తప్పు అని ఖండించలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు చంద్రబాబు పైన ఎందుకు అంత కోపం.. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాదని.. తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన చంద్రబాబు పైన ఎందుకు కోపం అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో చంద్రబాబుపైన ఇంక అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

