Sunday, September 13, 2026 10:50 AM
Sunday, September 13, 2026 10:50 AM

కూటమిలో సీట్ల పంచాయతీ.. తెగుతుందా.. లేదా..?

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల పరిస్థితి. స్థానిక సంస్థలకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. న్యాయ పరమైన చిక్కుల కారణంగా.. అది విడుదల అవుతుందో లేదో కూడా తెలియదు. అయితే.. ఇవేవి పట్టని రాజకీయ నేతలు మాత్రం.. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల లెక్కల్లో బిజీగా ఉన్నారు. ఇక ఆయ పార్టీల ముఖ్య నేతలు కూడా గెలుపు ఓటముల లెక్కల్లో తలమునకలై ఉన్నారు. అయితే తాజాగా ప్రధాన పార్టీల నేతల మధ్య ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే డిప్యూటీ స్థానం. అవి ఎన్ని ఉంటాయి..? ఎవరికి ఇస్తారు..? అనే అంశం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్.

Also Read : ఎన్టీఆర్ భరోసాకు సెలవుల గండం..!

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేది ప్రభుత్వం మాట. అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే చెప్పేశారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా లోకల్ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా చూడాలని.. అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇక కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నేతలు కూడా మేయర్, జెడ్పీ చైర్మన్ స్థానాల కోసం ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.

Also Read : వల్లభనేని ఆస్తుల గుట్టు విప్పిన కొడాలి..!

నిజానికి మేయర్ స్థానాల విషయంలో ఇప్పటికే పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల మేయర్ స్థానాల కోసం జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ సీట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దీంతో.. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు పార్టీల అధినేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదే డిప్యూటీ మేయర్ లేదా ఛైర్మన్ పదవుల కేటాయింపు. మేయర్ స్థానం ఒక పార్టీకి కేటాయిస్తే.. డిప్యూటీ మేయర్ స్థానానికి మిగిలిన రెండు పార్టీల నేతలకు సమానంగా ఇవ్వాలని లేదా రెండు డిప్యూటీ స్థానాలు కేటాయించాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఇదే రూల్‌ను మునిసిపల్ ఛైర్మన్, జెడ్పీ ఛైర్మన్ స్థానాలకు కూడా అమలు చేయాలనేది ప్రస్తుతం అధినేతల ఆలోచన.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

రమా నందనాను వెంటాడుతున్న...

లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ...

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు...

వల్లభనేని ఆస్తుల గుట్టు...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని...

DSC స్పోర్ట్స్‌ కోటా...

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో...

ఉత్తరాంధ్రలో వైసీపీ వైట్...

ఉత్తరాంధ్ర రాజకీయం మారుతోంది. ఉమ్మడి విజయనగరం...

పోల్స్