తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత సి. జోసెఫ్ విజయ్ తొలిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ నెల 10న తొలిసారి బ్రిటన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుండగా, మరోవైపు విజయ్ లండన్ టూర్ చుట్టూ రాజకీయ, వ్యక్తిగత సర్కిల్స్‌లో సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలు ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చాయి.
Also Read : ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ రికార్డ్..!
గత కొంతకాలంగా విజయ్, ఆయన సతీమణి సంగీత విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, గత ఆగస్టు నెలలోనే సంగీత కోర్టులో తాను వేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. దీంతో విడాకుల వివాదానికి పూర్తిగా తెరపడింది. ఈ కేసు క్లోజ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే సీఎం విజయ్ లండన్ ప్రయాణం ఖరారు కావడం విశేషం. ప్రస్తుతం సంగీత లండన్‌లోనే నివసిస్తుండటంతో, సీఎం విజయ్ అక్కడ ఆమెను వ్యక్తిగతంగా కలుస్తారని, ఈ పర్యటన ఒక రకమైన ఫ్యామిలీ రీ-యూనియన్ కాబోతోందంటూ గట్టి ప్రచారం సాగుతోంది.
Also Read : బొండా ఫ్యామిలీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?
అయితే, ఈ వ్యక్తిగత ప్రచారాలను టీవీకే పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. సీఎం విజయ్ లండన్ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల కోసమేనని వారు స్పష్టం చేస్తున్నారు. తమిళనాడుకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశ్యమని చెప్తున్నారు. లండన్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో సీఎం విజయ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల సృష్టికి సంబంధించిన పలు కీలక ఒప్పందాలపై ఆయన సంతకాలు చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ నుండి అనుమతులు కూడా లభించాయి.

