Friday, September 4, 2026 04:45 PM
Friday, September 4, 2026 04:45 PM

నేను సీఎం అవుతా.. మరో బాంబు పేల్చిన కవిత..!

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ స్థాపించి సొంత గూటిపైనే సమర శంఖం పూరించిన కల్వకుంట్ల కవిత, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షురాలి హోదాలో జరిగిన ఒక బహిరంగ వేదికపై ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తన భవిష్యత్తు పొలిటికల్ అజెండాను ఓపెన్‌గా ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విరుచుకుపడ్డారు.

Also Read : భార్య దగ్గరకు విజయ్.. లండన్ టూర్ అందుకే అని టాక్..?

ఈ సందర్భంగా కవిత తన పొలిటికల్ ఆంబిషన్స్‌ను నిర్మొహమాటంగా పంచుకున్నారు. “రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అయితే కేవలం అధికారం చలాయించడం నా లక్ష్యం కాదు.. ఆ సీఎం హోదాకి ఒక గౌరవం, విలువ తీసుకురావడమే నా ఉద్దేశ్యం” అంటూ ఆమె స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత నేరుగా సీఎం కుర్చీని ప్రస్తావించడం ఆమె క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా విధానాలపై కవిత అత్యంత ఘాటైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read : భార్య దగ్గరకు విజయ్.. లండన్ టూర్ అందుకే అని టాక్..?

చరిత్రలో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వారిని ఉద్దేశించి వాడే ‘తుగ్లక్ చర్యలు’ అనే పదాన్ని ఇకపై మార్చేయాల్సిన సమయం వచ్చిందని ఆమె సెటైర్లు వేశారు. “ఇప్పటి నుంచి ఎవరైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే వారిని తుగ్లక్ అనాల్సిన అవసరం లేదు.. ‘రేవంత్ రెడ్డి లాగా చేస్తున్నావ్’ అంటే చాలు.. అంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదు” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఈ మధ్య సైలెంట్ అయిన కవిత.. మళ్ళీ స్పీడ్ పెంచి విమర్శల దూకుడు కొనసాగిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వివేకా హత్య కేసులో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

ఇంటింటికీ తెలుగుదేశం క్రేజీ...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం రెండేళ్ల...

జనంలోకి జగన్.. పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పాదయాత్రల వేడి...

కొండా సురేఖ సంచలన...

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ...

బొండా ఫ్యామిలీకి చంద్రబాబు...

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నగారా...

వెలిగొండ… కరవు ప్రాంతానికి...

మార్కాపురం జిల్లా గంటవానిపల్లె దగ్గర పూల...

పోల్స్