ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నేపాల్ వరదల నేపధ్యంలో భూ ఉష్ణోగ్రతలు మరోసారి సంచలనంగా మారాయి. ఐరాస్ నివేదిక ప్రకారం భూగోళాన్ని వేడిమి నుంచి రక్షించేందుకు కుదుర్చుకున్న చారిత్రాత్మక ‘పారిస్ క్లైమేట్ ఒప్పందం’ నిర్దేశించుకున్న కనీస పరిమితిని భూమి అతి త్వరలోనే అధిగమించబోతోందని ఐరాస స్పష్టం చేసింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోనుందని ఈ నివేదిక వెల్లడించింది.
Also Read : మొన్న భోగాపురం.. నిన్న వెలిగొండ.. నేడు ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు!
ప్రస్తుతం ప్రపంచ దేశాలు ప్రకటిస్తున్న పర్యావరణ ప్రతిజ్ఞలు, నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాలను వంద శాతం అమలు చేసినప్పటికీ.. గరిష్ట ఉష్ణోగ్రత పెరుగుదల పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. దీనివల్ల మానవాళి ఊహించని రీతిలో పర్యావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మంచు పలకలు కరిగిపోవడం, హిమానీనదాలు అంతరించిపోవడం వంటి తీవ్ర మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు.
Also Read : తెలంగాణా బిజెపిలో ఎంపీల మధ్య రచ్చ.. అసలేం జరిగింది..?
ఈ నివేదిక ప్రకారం, 2100 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లేసియర్లు తమ మొత్తం ద్రవ్యరాశిలో నాలుగో వంతు కంటే ఎక్కువ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా సముద్ర మట్టాలు 9 నుండి 12.5 సెంటీమీటర్ల వరకు పెరిగి, అనేక తీర ప్రాంతాలు మునిగిపోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇటీవల ఆగస్టు 26న నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో హిమానీనదం కుప్పకూలి వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఐరాస ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

