Thursday, September 3, 2026 10:01 AM
Thursday, September 3, 2026 10:01 AM

నేను రాజీనామా చేయాలంటే సిఎం చేయాల్సిందే..!

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో రేగిన మంత్రి కొండా సురేఖ వివాదం ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖగా మారి పీక్స్‌కు చేరింది. ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరుగుతున్న తరుణంలోనే, మంత్రి కొండా సురేఖ మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు గాంధీ భవన్‌తో పాటు పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్నాయి. నాపై చర్యలు తీసుకునే దమ్ముంటే, ముందు సీఎం రేవంత్ రెడ్డిపై యాక్షన్ తీసుకోండి అంటూ సురేఖ అధిష్ఠానం ముందే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Also Read : స్థానిక ఎన్నికల్లో జనసేన మార్క్ వ్యూహం..!

చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. “నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు.. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు. నా కూతురిని అవతలి వాళ్లు రెచ్చగొట్టినందుకే ఆమె అలా విమర్శించాల్సి వచ్చింది. ఒకవేళ పార్టీలో యాక్షన్ తీసుకోవాలనుకుంటే ముందుగా సీఎంపైనే తీసుకోవాలి. పదేళ్లపాటు నేనే సీఎంని అని రేవంత్ ఎలా అంటారు? అది క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రాదా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అంతేకాకుండా, తదుపరి ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే టికెట్ ఎవరికన్నది రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని, బహిరంగంగా అభ్యర్థులను ప్రకటించడానికి సీఎంకు ఏం హక్కు ఉందని సురేఖ నిలదీశారు.

Also Read : ఆటోమొబైల్ రంగంలో సంచలనం.. హోండా, నిస్సాన్ భారీ డీల్..!

ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అంతర్గత అసంతృప్తిని కూడా సురేఖ బయటపెట్టారు. “ప్రస్తుతం క్యాబినెట్‌లో మంత్రులు, నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలువురు మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. మరి వాటికి ఏం సమాధానం చెబుతారు? వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? పార్టీలో బీసీ నేతలకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని స్పష్టం చేసిన సురేఖ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఏఐసీసీ అధిష్ఠానానికి రాతపూర్వకంగా నివేదించానని పేర్కొన్నారు. కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లీడర్‌షిప్‌నే క్వశ్చన్ చేస్తూ ఇలా బాంబులు పేల్చడంతో తెలంగాణ కాంగ్రెస్ లొల్లి ఇప్పుడు ఢిల్లీలో ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

మొన్న భోగాపురం.. నిన్న...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కొన్ని రోజులు...

తెలంగాణా బిజెపిలో ఎంపీల...

రాష్ట్ర బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య...

ఇకపై నాయకుల కోసం...

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై...

వెలిగొండ.. నీటి పంపకాల...

30 ఏళ్ల కల సాకారమైంది. శ్రీశైలం...

పోల్స్