Thursday, September 3, 2026 11:19 AM
Thursday, September 3, 2026 11:19 AM

జనసేన యూత్ విభాగం లాంచ్.. పేరు ఇదే..!

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా పార్టీ ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన యువజన విభాగాన్ని ‘జై కొట్టు’ పేరుతో అధికారికంగా ప్రారంభించారు.. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన ఒక భారీ బహిరంగ వేదికపై ఈ ‘జై కొట్టు’ యువజన విభాగం పేరును, దాని అధికారిక లోగోను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అత్యంత వైభవంగా ఆవిష్కరించారు.

Also Read : నేను రాజీనామా చేయాలంటే సిఎం చేయాల్సిందే..!

ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద వైద్య చికిత్స పొందుతున్న కారణంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఈ వేడుకలకు నేరుగా హాజరుకాలేకపోయినప్పటికీ, యువతలో సరికొత్త రాజకీయ జోష్ నింపేలా ఆయన ప్రత్యేకంగా ఒక ఆడియో సందేశాన్ని పంపించారు. రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పు కోసం, సామాజిక బాధ్యతతో కూడిన సరికొత్త సమాజ నిర్మాణం కోసం యువత అంతా ఈ ‘జై కొట్టు’ వేదిక ద్వారా ఏకం కావాలని పవన్ కల్యాణ్ తన సందేశంలో పిలుపునిచ్చారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి యువశక్తికి ఈ విభాగం ఒక చక్కని వేదికగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : ఇకపై నాయకుల కోసం కాదు : పవన్ సంచలన కామెంట్స్..!

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు, మహిళలకు సంస్థాగత నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత కల్పించడమే ఈ యువజన విభాగం ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్న యువతీ యువకులను గుర్తించి ఈ ‘జై కొట్టు’ వేదిక ద్వారా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లనుంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడే ఈ నూతన విభాగాన్ని ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసైనికులు, యువతలో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రాపిడో, ఓలా, ఉబర్‌ల...

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో రాత్రి వేళల్లో...

ఢిల్లీలో మంతనాలు.. తెలంగాణ...

తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ...

మొన్న భోగాపురం.. నిన్న...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కొన్ని రోజులు...

తెలంగాణా బిజెపిలో ఎంపీల...

రాష్ట్ర బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య...

నేను రాజీనామా చేయాలంటే...

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌లో రేగిన మంత్రి...

ఇకపై నాయకుల కోసం...

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై...

పోల్స్