వైసీపీలో పదవులు కావాలంటే మతం మారాలా..? క్లిస్టియన్లయితేనే ఆ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందా..? కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబం క్రిస్టియన్స్ అనే విషయం ఈ మధ్య కాలం వరకు ఎవరికీ తెలియదు. బీసీ నాయకుడు అని చెప్పుకున్నారు గానీ.. మతం మారిన లీడర్ అని.. జోగి రమేశ్ కోడలి వివాదం వెలుగులోకి వచ్చాకే అందరికీ తెలిసింది.
Also Read : అమరావతిలో మళ్ళీ ల్యాండ్ పూలింగ్.. ఈసారి ఎంతంటే..!
తాజాగా కర్నూలు కర్నూలు వైసీపీ ఇంఛార్జ్ ఎస్వీ మోహన్‌రెడ్డి కుటుంబం క్రైస్తవ మత ప్రార్ధనలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఈయనే కాదు.. వైసీపీలో ఎమ్మెల్యే స్థాయి నాయకుల్లో సగం మంది మతం మారారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏసు క్రీస్తుని నమ్మడం, క్రిస్టియన్ మతాన్ని పాటించడం తప్పు కాదు. కానీ మతం మారినా ఇంకా హిందువుల ముసుగేసుకొని ప్రజలను మోసం చేయడమే పెద్ద తప్పు అవుతుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. జగన్ హయాంలో రాష్ట్రంలో భారీ స్థాయిలో మత మార్పిడులను ప్రోత్సహించారని చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌గా తెలుగు ఐఏఎస్..!
జగన్ స్వయంగా వందలాది చర్చిల నిర్మాణానికి సహకరించారని.. హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి మాత్రం ఏమీ చేయలేదని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వైసీపీ శ్రేణులనే ఆలోచనలో పడేస్తున్నాయి. మతం మారిన జోగి రమేశ్‌లాంటి వాళ్లు జగన్‌కి అత్యంత సన్నిహితులుగా ఉంటే.. అంతకు ముందు బాగా క్లోజ్ అయినా మతం మార్చుకోని విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వంటి వాళ్లు మాత్రం వైసీపీని వదిలేయాల్సి వచ్చింది. వైసీపీలో ఈ మత కోణం గురించి ఆంధ్రప్రదేశ్‌లో హిందువులంతా ఆలోచించాలని ధార్మికవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

