Friday, August 28, 2026 05:16 PM
Friday, August 28, 2026 05:16 PM

రాఖీ పండుగ శుభవేళ.. చెల్లెళ్ళ ముఖం చూడని అన్నలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతల తీరు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వాళ్ళిద్దరూ ఎవరో కాదు వైఎస్ జగన్.. కేటీఆర్. ఇద్దరు అన్నల పరిస్థితి సేమ్ టు సేమ్. ఏపీలో తన చెల్లి వచ్చి జగన్ కి రాఖీ కట్టలేదు. తెలంగాణలోనూ కేటీఆర్ కి కవిత రాఖీ కట్టలేదు. రాజకీయంగా అన్నలిద్దరూ ఒకే ట్రాక్ లో జర్నీ చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో జగన్ టూర్ కి వస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కేటీఆర్-జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోలతో ఈ ఫ్లెక్సీలు కనిపిస్తాయి. అంతెందుకు జగన్ కర్నూలు పర్యటనలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించాయి. దీనిని బట్టి ఇద్దరి మధ్య బంధం పెవికాల్ కంటే గట్టిగానే ఉందని కామెంట్లు పడుతున్నాయి.

Also Read : ఇలా అయితే మా వల్ల కాదు..!

తాజాగా రక్షా బంధన్ వేళ కూడా ఈ బంధం కనిపించింది. జగన్ తన పార్టీ మహిళా నేతలతో రాఖీలు కట్టించుకున్నారు కానీ.. సొంత తోడబుట్టిన చెల్లితో మాత్రం రాఖీ కట్టించుకోలేదు. తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అయింది. కేటీఆర్‌కు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా? అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా టీఆర్ఎస్ నేత కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నమాటలు వైరల్ అవుతున్నాయి. 2025లో రాఖీ పండుగ సమయంలో కేటీఆర్ నగరంలో లేకుండా వెళ్లిపోయారని.. ఈసారి మాత్రం తాను అడగకముందే ఆయన విదేశాలకు వెళ్లిపోయారని కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాము కూడా ఆత్మగౌరవం ఉన్న ఆడబిడ్డలమేనని, తన ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతిందన్నారు.

Also Read : ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.. భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

గతేడాది రాఖీ సమయంలో కేటీఆర్ నగరంలో లేకపోవడంతో అన్నకు రాఖీ కట్టలేకపోయానని కవిత పేర్కొన్నారు. ఈసారి పరిస్థితి మరింత భిన్నంగా ఉందని, ఆయన ఏకంగా దేశంలోనే లేకుండా వెళ్లిపోయారని అన్నారు. దీంతో ఈ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా అన్నాచెల్లెళ్లు కలుసుకునే పరిస్థితి కనిపించడం లేదనే సంకేతాలు వెలువడ్డాయి. కొన్నేళ్ళ క్రితం వరకూ ఎంత కలర్‌ఫుల్ డ్రామా నడిచేది అని పాత రోజులను గుర్తుచేసుకుని జనం నవ్వుకుంటున్నారు. జనాలు ఇలా సీరియస్‌గా రీవైండ్ చేసుకుంటుండటం ఆ అన్నలిద్దరికీ పెద్ద తలనొప్పిగా, కష్టంగా మారిపోయింది.

Also Read : అమరావతిలో మళ్ళీ ల్యాండ్ పూలింగ్.. ఈసారి ఎంతంటే..!

రాఖీ వేళ అందరి ఇళ్లలో తీపి గులాబ్‌జామ్‌లు తింటుంటే జగన్ -కేటీఆర్ లకు మాత్రం కాకరకాయ జ్యూస్ తాగినంత కష్టంగా మారింది. రాఖీ పండుగ పేరు వింటేనే బ్రదర్స్ ఇద్దరూ సైలెంట్ అయిపోతున్నారు. క్యాడర్ కూడా మాకెందుకొచ్చిన గొడవ మిమ్మల్ని వదిలేయండి అంటూ తప్పించుకుంటున్నారు.ఇలాంటి బ్రదర్స్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఎవరూ ఉండరేమో..కొసమెరుపు ఏంటంటే.. తనకు తోడబుట్టిన చెల్లెళ్ళు లేకపోయినా మంత్రి లోకేష్ మాత్రం దేవుడిచ్చిన ఆడపడుచుల చేత రాఖీలు కట్టించుకుని పండుగని మరింత అందంగా, ఆహ్లాదకరంగా మార్చేశారు.. దటీజ్ తెలుగు పాలిటిక్స్.

– జి.సత్యనారాయణరాజు

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

పోల్స్