Wednesday, October 14, 2026 08:02 AM
Wednesday, October 14, 2026 08:02 AM

కేంద్రంపై విజయ్ మాల్యా సంచలన ఆరోపణలు..!

పరారీలో ఉన్న భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన సోషల్ మీడియా వేదికగా భారత బ్యాంకింగ్ మరియు రుణ పరిష్కార వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు నిర్ధారించిన రూ. 6,203 కోట్ల అసలు అప్పునకు గాను, బ్యాంకులు మరియు భారత ప్రభుత్వం ఇప్పటికే తన నుండి రూ. 14,100 కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. తన అప్పు కంటే రెండింతలు ఎక్కువ రికవరీ చేసినప్పటికీ, తనకు ఇంకా న్యాయం జరగడం లేదని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : నేపాల్ ప్రళయం.. భారత్‌కు భారీ వరద వస్తోందా..?

మరో వ్యాపారవేత్త సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార వ్యవహారాన్ని ఉదహరిస్తూ మాల్యా ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ బకాయిలు ఉన్న చాలా మంది వ్యాపారవేత్తలు తమ మొత్తం అప్పుల్లో కేవలం ఒక చిన్న శాతాన్ని చెల్లించి రుణ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒకరికి ఒకలా, తనకు మరొకలా వ్యవహరించడంపై మాల్యా అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిని “భారత రుణ పరిష్కార న్యాయం” గా ఎద్దేవా చేశారు.

Also Read : ఆ విషయంలో వైసీపీ ఘోర వైఫల్యం..!

ఈ రికవరీ గణాంకాలపై గతంలో ప్రభుత్వ నివేదికలకు, బ్యాంకులు చెబుతున్న లెక్కలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని మాల్యా వాదించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా చేసిన ఈ తాజా ట్వీట్ మరియు ఆరోపణలు ఇప్పుడు జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. తన ఆస్తుల రికవరీ పూర్తయినందున తనకు ఉపశమనం లభించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది విడుదల చేసిన ఓ పాడ్ కాస్ట్ లో కూడా విజయ్ మాల్యా ఈ అంశం గురించి ప్రస్తావించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీని తుడిచేస్తున్న చిన్న...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి...

తెలంగాణ బీజేపీలో కాక్రోచ్...

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్...

విశాఖ మేయర్ రిజర్వేషన్...

బీజేపీ నేతల ఒత్తిళ్లతోనే విశాఖపట్నం నగర...

జగన్ ను భయపెడుతోన్న...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

పోల్స్