Friday, August 28, 2026 11:20 AM
Friday, August 28, 2026 11:20 AM

నేపాల్ ప్రళయం.. భారత్‌కు భారీ వరద వస్తోందా..?

నేపాల్ రసువా జిల్లాలోని భోటే కోషి నదిలో ఒక్కసారిగా మంచు, బురద గోడలు బద్దలై వచ్చిన హఠాత్ ప్రళయం వందలాది మందిని బలితీసుకుంది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, గల్లంతైన వారిలో 133 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. అయితే ఈ ప్రళయ నీరు ఇప్పుడు నేపాల్ సరిహద్దుకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను వణికించేస్తోంది.

Also Read : తెలుగుదేశం పార్టీకి కేంద్రం కీలక పదవి..!

దీనికి అసలు కారణం నేపాల్, భారత్‌ల మధ్య ఉన్న ‘నారాయణి-గండక్’ నదీ అనుసంధానం. నేపాల్‌లో ప్రవహించే నారాయణి నదే భారత సరిహద్దు దాటి బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినప్పుడు గండక్ నదిగా మారుతుంది. ఇప్పుడు నేపాల్ కొండల్లో బద్దలైన కోట్లాది లీటర్ల నీరంతా ఈ మార్గం ద్వారానే భారత్‌ వైపు ముంచెత్తుతుండటంతో, ముందస్తు జాగ్రత్తగా బీహార్‌లోని వాల్మీకినగర్ గండక్ బారేజ్ కి సంబంధించిన అన్ని 36 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

Also Read : దిల్ రాజుకు ఇతర భాషలు కలిసి రావడం లేదా..?

ఈ ఊహించని నీటి ఉధృతి కారణంగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్ సహా ఐదు జిల్లాల లోతట్టు ప్రాంతాల ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయిస్తోంది. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సరిహద్దు జిల్లాల అధికారులను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో ఇలాంటి ప్రమాదాల తీవ్రత మరింత ఎక్కువవుతోందని, నేపాల్‌లో జరిగే పర్యావరణ మార్పులు నేరుగా భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనడానికి ఈ ప్రళయమే ఒక ఉదాహరణ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

దిల్ రాజుకు ఇతర...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు...

పోల్స్