కె.జి.యఫ్ సిరీస్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాల షెడ్యూల్లో కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. ఆయన దర్శకత్వంలో ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రుక్మిణి వసంత్ కథానాయికగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స జరగడం, ఆయన పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించడంతో ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Also Read : ఏపీలో కొత్త మద్యం పాలసీ..!
ఎన్టీఆర్ గాయం కారణంగా లభించిన ఈ 3 నెలల విరామాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏమాత్రం వృథా చేయకూడదని భావిస్తున్నారు. మొదట ఎన్టీఆర్ లేని సీన్లను చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ, తన ప్రాధాన్యతలను మార్చుకుని తన సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సలార్’ పార్ట్-1 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పటికే దాదాపు 20 శాతం షూటింగ్ కూడా పూర్తయింది.
Also Read : గ్రూప్ 1 అక్రమాలు నిజమే.. వైసీపీకి షాక్ ఇచ్చిన సిట్
ఈ లభించిన 3 నెలల వ్యవధిలో హీరోల అవసరం లేకుండా పూర్తయ్యే స్క్రిప్ట్ వర్క్, సీన్ల ప్రీ-విజువలైజేషన్, కొత్త నటీనటుల ఎంపిక, అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్లకు సంబంధించిన సెట్స్ రూపకల్పన వంటి కీలకమైన పనులను ప్రశాంత్ నీల్ వేగవంతం చేయనున్నారు. ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి ‘డ్రాగన్’ సెట్స్‌లో జాయిన్ అయ్యేలోపు, నీల్ ‘సలార్ 2’ పనులను ఒక కొలిక్కి తీసుకురానుండటంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

