కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ భారీ ఎత్తున వెలిసిన ఫ్లెక్సీలు స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ‘జగన్ గో బ్యాక్’ అంటూ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, నిరసనకారులు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
జగన్ పర్యటన నేపథ్యంలో ఈ విధమైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం వైప్యాసార్‌సీపీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తుండగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ నిరసన ఫ్లెక్సీలలో ప్రధానంగా రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీ అంశాన్ని నిరసనకారులు ప్రస్తావించారు. నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన వైఖరిపై మండిపడుతూ, దమ్ముంటే ఈ అంశంపై అసెంబ్లీకి వచ్చి బహిరంగ చర్చకు రావాలంటూ జగన్‌కు సవాల్ విసిరారు.
Also Read : దమ్ముంటే సభకు రా.. జగన్‌కు ఆలపాటి ఛాలెంజ్..!
వీటితో పాటు, గతంలో ఎస్సీలపై దాడులకు తెగబడిన వారిని, సమాజంలో అశాంతిని రేపిన క్రిమినల్స్ మరియు నిందితులను పరామర్శించేందుకు రావడానికి మీకు అసలు సిగ్గుందా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. మరీ ముఖ్యంగా, ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ పేరుతో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. “జగన్.. నీకు నిజంగా దమ్ముంటే, గత ఐదేళ్ల నీ పాలనలో జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై, అప్పులపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి తప్ప.. ఇలా దొంగచాటుగా పరామర్శల పేరుతో డ్రామాలు ఆడటం కాదంటూ” ఈ ఫ్లెక్సీల వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

