Wednesday, August 12, 2026 04:56 PM
Wednesday, August 12, 2026 04:56 PM

సక్సెస్ ట్రాక్ ఎక్కిన మెగా హీరోలు.. ఇక ఆ ఇద్దరిపైనే అందరి కళ్లు..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా హీరోలు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని చాటుకుంటూ ఫామ్‌లోకి వచ్చారు. గతంలో వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడినప్పటికీ, గతేడాది విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ బాక్సాఫీస్ జాతకం పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టిన ‘ఓజీ’ చిత్రంతో రికార్డులు సృష్టించగా, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రాంతీయ చిత్రాల్లో ఆల్-టైమ్ రికార్డ్ విజయాన్ని దక్కించుకున్నారు. వీరికి తోడు రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంతో భారీ వసూళ్లు సాధించగా, తాజాగా వరుణ్ తేజ్ సైతం ‘కొరియన్ కనకరాజు’ మూవీతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

Also Read : శాంతిభద్రతలపై సీఎం నేడు కీలక సమావేశం..!

ఇలా నలుగురు మెగా హీరోలు బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో దూసుకుపోతుండగా, మెగా కాంపౌండ్‌లో ఇక సక్సెస్ అందుకోవాల్సింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమేనని అభిమానులు లెక్కిస్తున్నారు. వారిలో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేదు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ‘సంబరాల ఏటి గట్టు’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌తో ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అవ్వగా, చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : ఆ రాష్ట్రానికి శాపంగా మారిన పులులు..?

మరోవైపు ‘ఉప్పెన’తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన పంజా వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో కొంతకాలంగా వెనుకబడ్డాడు. ‘ఆదికేశవ’ వచ్చి మూడేళ్లవుతున్నా అతని తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా అధికారికంగా పట్టాలెక్కించలేదు. ఎప్పుడొచ్చినా ఈ ఇద్దరు మేనల్లుళ్లు కూడా హిట్ కొడితే మెగా ఫ్యామిలీ అంతా సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు మెగా డాటర్స్ కూడా నిర్మాతలుగా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతుండటం విశేషం. సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిర్మించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోగా, నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రాళ్లు’, ‘రాకాస’ చిత్రాలతో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

విదేశీ శ్రీవారి భక్తులకు...

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని...

ప్రకాశ్ రాజ్ ఓటు...

బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్...

డిప్యూటి సిఎం భార్యపై...

తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

శాంతిభద్రతలపై సీఎం నేడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా...

ఢిల్లీ వేదికగా మళ్లీ...

రాష్ట్రంలో ప్రగల్భాలు పలికే వైకాపా అధినేత...

బాలినేని – దామచర్ల...

ఒంగోలు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా...

పోల్స్